వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిటికీల కోసం రూ 73 లక్షలు: సీఎం క్యాంపు కార్యాయం కోసం 15 కోట్లు ఖర్చు: ప్రతిపక్షాల ఫైర్..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం..ఇంటికి కొత్తగా ల్యూమినియమ్‌ కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉంటున్న నివాసానికి ద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు..కిటికీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రభుత్వం అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తాడేపల్లిలోని తన నివాసం క్యాంపు కార్యాలయంగా మారింది.

ముఖ్యమంత్రి రాక పోకల కోసం పరిసరాల్లో అభివృద్ధి, భద్రతా చర్యల కోసం ఇప్పటి వరకు రూ.15 కోట్లు విడుదల చేశారు. దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రూపాయి జీతం అని చెప్పుకుంటున్న జగన్ ఇంత భారీ మొత్తంలో ఎలా ఖర్చు చేస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే వీటి ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు.

కిటికీలు..తలుపుల కోసం రూ. 73 లక్షలు

కిటికీలు..తలుపుల కోసం రూ. 73 లక్షలు

ముఖ్యమంత్రి జగన్ ఇంటిలోనూ..కార్యాలయంలోనూ కొత్తగా అల్యూమినియమ్‌ కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌ ఎన్నికల ముందే ఈ నివాసాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక క్యాంప్‌ ఆఫీసుగా ఉపయోగించుకుంటున్నారు. కొత్త భవనమే అయినప్పటికీ... భద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు, కిటికీలు ఏర్పాటు చే యాలని భావించారు. దీని కోసం తాజాగా ప్రభుత్వం ఈ మొత్తం ఖర్చుకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

లోకేశ్ ట్వీట్

అయితే, దీని పైన ఇప్పటికే మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్ చేసారు. రూపాయి జీతం తీసుకొనే ముఖ్యమంత్రి తన ఇంటి కిటికీల కోసం ప్రజల సొమ్ము రూ. 73 లక్షలు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన నివాసం..కార్యాలయం..ఆయన ఉంటే ఇంటి పరిసరాల్లో అభివృద్ధి, భద్రతా చర్యల కోసం రూ.15 కోట్లు విడుదల చేయటం పైన విమర్శలు మొదలయ్యాయి. టీడీపీ నేతలు సైతం జగన్ నివాసం కోసం కేటాయిస్తున్న నిధుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు.

భద్రతా చర్యల్లో భాగంగా మార్పులు..

భద్రతా చర్యల్లో భాగంగా మార్పులు..

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన ఉండే ఇంటి పరిసర ప్రాంతాల్లో అనేక మార్పులు చేసారు. భద్రతా పరంగా చర్యల్లో భాగంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
జగన్‌ నివాసం వద్ద 3.66 మీటర్ల వెడల్పున్న రహదారిని ప్రమాణ స్వీకారానికి ముందే 10 మీటర్ల వెడల్పు చేసేందుకు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ రహదారి పొడవు 1.33 కిలోమీటర్లు. జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను ఈ పనికి వినియోగించారు. సీఎం రక్షణ కోసం జరిగిన సెక్యూరిటీ వింగ్‌ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రహదారి ఏర్పాటు చేసారు. అదే విధంగా.. జగన్‌ రక్షణకోసం ఆయన ఇళ్లు, పరిసరాల్లో తదుపరి చర్యలు చేపట్టేందుకు రూ. 1.89 కోట్లు విడుదల చేస్తూ ఆర్‌అండ్‌బీ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది.

ఇతర సదుపాయాలకోసం

ఇతర సదుపాయాలకోసం

జగన్‌ ఇంటి వద్దే ప్రత్యేకంగా హెలిప్యాడ్‌, దానికి ఫెన్సింగ్‌, ఇంకా అక్కడికి వెళ్లడానికి అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణం కోసం రూ.40 లక్షలు, హెలిపాడ్‌ వద్ద గార్డ్‌ రూమ్‌ , ఇతర సదుపాయాలకోసం రూ. 13.50 లక్షలు, సీఎం నివాసం వద్ద పర్మినెంట్‌ బారికేడింగ్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు, సీఎం ఇంటి సమీపంలోనే పోలీస్‌ బ్యారెక్‌, సదుపాయాలకోసం రూ. 30 లక్షలు, సెక్యూరిటీ పోస్ట్‌, సెక్యూరిటీ గేట్స్‌, పోర్టా క్యాబిన్‌ల ఏర్పాటుకు రూ. 31 లక్షలు కేటాయించారు.సీఎం ఇల్లు, దాని పరిసరాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా, నిర్వహణ చేపట్టే నిపుణులైన సిబ్బంది కోసం రూ.8.50 లక్షలను విడుదల చేసారు. ఇవన్నీ వీవీఐపీ రక్షణ కోసం తీసుకున్న చర్యలుగా ప్రభుత్వం వివరణ ఇస్తోంది.

English summary
AP govt released rs 73 lacks for cm Jagan home windows and doors with aluminium on security measures. Jagan aFter taken charge as CM Up to now nearly 15 cr spend for his home and surrounding developments in part of security measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X