వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిలో...జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు:మంత్రి కాల్వ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపు చేస్తామని గతంలో సిఎం ఇచ్చిన హామీ నేపధ్యంలో ఈ నిధులు ప్రధానంగా ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది బడ్జెట్ లో జర్నలిస్టులకు నిధుల కేటాయింపు జరపకపోవడంపై పాత్రికేయులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడం...మరోవైపు తెలంగాణా ప్రభుత్వం తమ బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఎపి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

AP Govt. Allocation Of Rs. 100 Crores For Journalists Welfare

ఎపిలో పాత్రికేయుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. ఎప్పట్నుంచో పాత్రికేయులు కోరుతున్నవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు నిధుల కేటాయింపు జరిపింది. ఈ విషయాన్నిరాష్ట్ర సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్‌పై ధన్యవాదాలు తెలిపే సమయంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ నిధుల కేటాయింపుపై ప్రకటన చేస్తారని తెలిపారు.

అలాగే జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ సభ్యులుగా ఉంటారు. పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు ఈ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిసింది.

English summary
Amaravathi: Minister for Rural Housing and Information and Public Relations Kalva Srinivasulu said that Rs 100 crore will be allocated for the welfare of journalists in Andhra Pradesh. The finance minister will announce about this matter in the assembly on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X