వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ‌ర జ‌వాన్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సాయం : ఏపి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది: చ‌ంద్ర‌బాబు

|
Google Oneindia TeluguNews

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జవాన్ల కుటుంబాల కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు.

ఏపి ప్ర‌భుత్వ ఎక్స్‌గ్రేషియా..
జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరం అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేర్కొ న్నారు. పార్టీ పాలిట్ బ్యూరో స‌మావేశంలో అమ‌ర జ‌వాన్ల‌కు సంతాపంగా మౌనం పాటించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. మానవ సమాజంలో ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు దుర్గా ర్గం... అత్యంత హేయం మ‌ని ఖండించారు.

AP govt anounced 5 lakh rupees compensation to the martyrs family

జరిగిన దారుణంలో 40 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదం అని ఆవేద‌న చెంఆరు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్య లకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మున్ముందు మరెప్పుడూ ఇలాంటి ఘోరకలి జరగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని.. ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

అమ‌ర జ‌వాన్ల త్యాగాలు మ‌ర‌వ‌లేం..

అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంద‌న్నారు సీయం చంద్ర‌బాబు. భారత సైనికులు నిరంత రం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా వుంటూ తమ విధులను నిర్వర్తిస్తు న్నార‌ని...మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా నిలిపి తెగువ చూపుతూ మనందరిలో స్ఫూర్తి ని నింపుతున్నారని కొనియాడారు. పుల్వామా దాడిలో ఒక్కరు, ఇద్దరు కాదు, 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింద‌న్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవా లని పిలుపు నిచ్చారు. ఆ వీర జవాన్ల కుటుంబాలకు నైతికస్థైర్యం అందివ్వడం మనందరి తక్షణ కర్తవ్యం అంటూ.. సైనికుల జీవితాలను మనం అందించే సాయంతో వెలకట్టలేం. కానీ, మనవంతు సహకారం అందించాల్సిన బాధ్యత ను విస్మరించలేమ‌న్నారు చంద్ర‌బాబు.

English summary
AP govt announced 5 lakh rupees compensation to the martyrs family. TDP Poliltbuero support for central Govt to action against terrorist activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X