వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 20 నుండి 24 వరకు ఏపీ ఎంసెట్: కాకినాడ జేఎన్టీయూకు బాధ్యత: ఇతర సెట్ ల షెడ్యూల్ విడుదల..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి కీలకమైన వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం కోసం ..సెట్ పరీక్షల షెడ్యూల్ విడదుల చేసింది. లక్షలాది మంది విద్యార్ధులు రాసే ఏపీ ఎంసెట్ పరీక్షను 2020, ఏప్రిల్ 20,21,22,23, 24 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడాది లాగానే ఈ సారి కూడా ఎంసెట్ పరీక్ష నిర్వహణా బాధ్యతను కాకినాడ జేఎన్టీయూకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఏపీ ఈ సెట్ ను ఏప్రిల్ 30, 2020 న నిర్వహించనున్నారు.

విశాఖ మెట్రో రైల్ టెండర్ రద్దు: ప్రభుత్వం కీలక ఉత్తర్వులు: తాజా నిర్ణయం ఏంటంటే..!విశాఖ మెట్రో రైల్ టెండర్ రద్దు: ప్రభుత్వం కీలక ఉత్తర్వులు: తాజా నిర్ణయం ఏంటంటే..!

ఏపీ ఐ సెట్ పరీక్ష నిర్వహణ తేదీ ఏప్రిల్ 27 , 2020 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఏపీపీజీఈ సెట్ పరీక్షను 2020, మే లో 2,3,4 తేదీల్లో నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎడ్ సెట్ ను మే 9న, ఏపీ లా సెట్ ను మే 8న నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

Ap Govt announced professional cources entrance exams dates

ఎంసెట్ పరీక్ష నిర్వహణా బాధ్యతలను జేఎన్టీయూ..కాకినాడకు అప్పగించిన ప్రభుత్వం.. ఈసెట్ నిర్వహణ ను అనంతపురం జేఏన్టీయూకు అప్పగించింది. ఏపీ ఐ సెట్ ఈ ఏడాది ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. ఏపీపీజీఈ సెట్ నిర్వహణ గతంలో లాగానే ఇప్పుడూ ఆంధ్రా యూనివర్సిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎడ్ సెట్ నిర్వహణ బాధ్యతలు గతంలో ఎస్వీ యూనివర్సిటీకి ఇవ్వగా..ఈ సారి ఆంధ్రా యూనివర్సిటీకి అప్పగించారు.

మరో కీలక పరీక్ష అయిన ఏపీ లా సెట్ ను గత ఏడాది లాగానే ఈ సారి కూడా ఎస్కే యూనివర్సిటీకే నిర్వహణా బాధ్యతలు కేటాయించారు. ఏపీ ఆర్ సెట్ ను ఎస్వీ యూనివర్సిటీకి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగానే ఈ పరీక్షల తేదీలు ప్రకటించటం ద్వారా సిద్దమయ్యేందుకు విద్యార్ధులకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేసారు.

English summary
Ap Govt announced professional cources entrance exams dates. AP Eamcet will be conduct on 2020, April 20th to 24th. This year Kakinada, JNTU conduct this exam. All other cets dates also announed by govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X