వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రైతుసంక్షేమం కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను రైతుల కోసం అందించిన సీఎం జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

సీఎం జగన్ పనితీరుతో త్వరలోనే ప్రధమస్థానంలో నిలుస్తారు : వైసీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీసీఎం జగన్ పనితీరుతో త్వరలోనే ప్రధమస్థానంలో నిలుస్తారు : వైసీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ

 రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ కీలక నిర్ణయాలు

రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ కీలక నిర్ణయాలు

ఒకటి కాదు రెండు కాదు ఏపీలో రైతు సంక్షేమం కోసం సీఎం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అన్నీ ఇన్నీ కావు . ఇప్పటికే రైతు భరోసా అందించి ఆదుకుంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు మేలు చేసేలాఖరీఫ్ సీజన్ లో విత్తన కష్టాలు లేకుండా విత్తన సరఫరా చేసింది. నీటి సౌకర్యం లేని వ్యవసాయ భూములలో ప్రభుత్వం సొంత ఖర్చుతో బోర్లు వేయించాలని కూడా నిర్ణయం తీసుకుంది.ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి , రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్.

 రైతుల కోసం జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు

రైతుల కోసం జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు

ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది . పరిశ్రమలు, వాణిజ్య శాఖ, వ్యవసాయ ,సహకార శాఖల సమన్వయంతో రైతుల కోసం జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల ఉత్పత్తులు, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ తో పాటు రైతులకు ప్రయోజనకరంగా ఉండే ఇతర అంశాలపై ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ సేవలు అందించనుంది.

Recommended Video

Andhra Pradesh New Industrial Policy 2020-23 | Oneindia Telugu
గిట్టుబాటు ధరలు , మార్కెటింగ్ పై పని చెయ్యనున్న కమిటీ

గిట్టుబాటు ధరలు , మార్కెటింగ్ పై పని చెయ్యనున్న కమిటీ

ఆరుగాలం శ్రమించి పంటలు పండించినప్పటికీ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం తెలియకపోవడం వంటి అనేక అంశాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులు నష్టపోకుండా ఉండటం కోసం జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.వ్యవసాయ, పరిశ్రమల శాఖలతో పాటుగా 11 ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ సభ్యులు వ్యవసాయ ఉత్పత్తులు, పండించడానికి కావలసిన నైపుణ్యం, ఆహారశుద్ధి, వాటి మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులతో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు.

English summary
The AP government has taken another crucial decision. A Joint Task Force Committee for Farmers has been set up in coordination with the Ministries of Industries, Commerce, Agriculture and Co-operation. The task force committee will provide services on agricultural products, horticultural products, MSP, marketing as well as other issues that benefit farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X