వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా విజృంభిస్తోన్న వేళ.. ఎయిమ్స్ మాజీ చీఫ్‌కు కీలక బాధ్యతలు: జీతం లేకుండా..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించిన పాజిటివ్ కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్య విభాగానికి ప్రత్యేకంగా ఓ సలహాదారుడిని నియమించారు. ప్రముఖ హృద్రోగ నిపుణుడు, అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, ఎయిమ్స్ మాజీ ఎండీ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని సలహదారుగా నియమించారు.

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా వేతనంగా తీసుకోవట్లేదని వెల్లడించారు. జీతంతో పాటు ప్రభుత్వ పరంగా అందే ఎలాంటి సౌకర్యాలను కూడా ఆయన స్వీకరించడానికి నిరాకరించారు. జీతం గానీ, ఎలాంటి బెనిఫిట్ల గానీ ఆయనకు వర్తించబోవని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రజారోగ్య విభాగానికి ఆయన ఉచితంగా సేవలను అందించడానికి ఆసక్తిగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

AP Govt appointed AIIMS Cordiology Ex Head Dr Srinath Reddy as advisor of Public Health

డాక్టర్ శ్రీనాథ్ రెడ్ది ప్రస్తుతం ఆయన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వైద్య రంగంలో ఆయన అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డును అందజేసింది. 1974లో హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన అనంతరం కీలక ఆసుపత్రుల్లో పనిచేశారు. ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రి ఎండీగా పని చేశారు. అదే ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగాధిపతిగా వ్యవహరించారు. 2017లో ఆయన ఒడిశా ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు.

బాలకృష్ణ నియోజకవర్గంలో రెండు కరోనా పాజిటివ్: పదేళ్ల బాలుడికి..ఆ రెండు జిల్లాల్లో భయోత్పాతం..!బాలకృష్ణ నియోజకవర్గంలో రెండు కరోనా పాజిటివ్: పదేళ్ల బాలుడికి..ఆ రెండు జిల్లాల్లో భయోత్పాతం..!

English summary
Government of Andhra Pradesh led by YS Jagan Mohan Reddy has appoints Dr. Srinath Reddy, Ex Head of the Department of Cardiology, All India Institute of Medical Sciences New Delhi as Advisor to the Government of AP. He will dispense his duty as advisor without drawing any salary or perks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X