వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ద్రరాత్రి ఉత్తర్వులు.. ఐపీఎస్ అధికారికి ఏపీపీఎస్సీ బాధ్యతలు: కారణం అదేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం అర్దరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ మౌర్యను బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి పీవీ చలపతిరావును రిలీవ్‌ చేయాలని మౌర్యను ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయ పరీక్షల ఫలితాల రోజు నుండి ఒక సెక్షన్ మీడియా లో ప్రశ్నాపత్రం లీకేజీ అయిందని.. ఏపీపీఎస్సీలో ఇదంతా జరిగిందంటూ ప్రచారం సాగింది.

అయితే, ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఈ ప్రచారాన్ని ఖండించారు. అసలు తమకు పరీక్షతోనే సంబంధం లేదని స్పష్టం చేసారు. అయితే..ఏపీపీఎస్సీలో ఒక అధికారి ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వాన్ని డామేజ్ చేసేందుకు ఇలా చేసారనేది ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీంతో..సచివాలయ పరీక్షలు..నియామక వ్యవహారం పూర్తయిన తరువాత అకస్మికంగా అర్దరాత్రి సమయంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ చేసిన స్థానంలో ఐపీయస్ అధికారికి బాధ్యతలు అప్పగించింది.

ఏపీపీఎస్సీ కార్యదర్శి బదిలీ..

ఏపీపీఎస్సీ కార్యదర్శి బదిలీ..

గ్రామ..వార్డు సచివాలయ పరీక్షల పైన ఒక సెక్షన్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పరీక్షాపత్రాల లీకేజ్ అయ్యయాని..ఫలితంగా కొందరికి ర్యాంకులు వచ్చాయని ప్రచారం జరిగింది .తొలతు ఏపీపీఎస్సీ కేంద్రంగా లీకేజ్ జరిగిందని..అందులోని కాంట్రాక్టు సిబ్బంది దీని కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిని ప్రభుత్వం ఖండించింది. దీని మీద అంతర్గతంగా ఈ ప్రచారం ఎందుకు జరిగింది...దీని వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేయించింది. అయితే.. ఆ తరువాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ అసలు ఈ పరీక్షతో తమకు సంబంధం లేదని ప్రకటించారు.

ఏపీపీఎస్సీలో ఎవరైనా

ఏపీపీఎస్సీలో ఎవరైనా

ప్రశ్నా పత్రాలు తాము తయారు చేయలేదని.. తమ వద్ద లీక్ అయ్యాయనేది తమకు సంబంధం లేని విషయం అని స్పష్టం చేసారు. దీంతో అప్పటి వరకు రాజకీయంగా విమర్శలు చేసిన వారు సైతం మిన్నకుండిపోయారు. అయితే..ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఏపీపీఎస్సీలో ఎవరైనా ఇటువంటి ప్రచారానికి సహకరించారా అనే కోణం లో విచారణ చేసింది. కానీ, అందులో ఏం తేలిందనే విషయం బయట పెట్టలేదు. ఇదే సమయంలో ఆకస్మికంగా అర్దరాత్రి వేళ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ మౌర్యను బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.

ఐపీఎస్ అధికారికి బాధ్యతలు

ఐపీఎస్ అధికారికి బాధ్యతలు

అదే సమయంలో ప్రస్తుతం ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి పీవీ చలపతిరావును రిలీవ్‌ చేయాలని మౌర్యను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. వచ్చే జనవరి నుండి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రతీ ఏడాది జనవరి మాసాన్ని ఉద్యోగాల భర్తీ మాసంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

దీంతో..ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఐపీఎస్ అధికారి.. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆంజనేయులను ఏపీ ప్రభుత్వం ఏరి కోరి కేంద్రం నుండి ఇక్కడకు రప్పించింది. ఆయనకు కీలకమైన రవాణా శాఖ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చింది. ఇప్పుడు దీనికి అదనంగా ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కొత్త బాధ్యతలను ఆయన పైన పెట్టింది. త్వరలోనే మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

English summary
Ap Govt appointed IPs officer as APPSC commissioner. present commissioner Mourya transferred and Anjaneyulu re placed him. After village secretariat exams results govt taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X