వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘వెలిగొండ’ రివర్స్ టెండరింగ్ సక్సెస్: రూ. 62కోట్లు ఆదా, ఆ సంస్థకే టెండర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రివర్స్‌టెండరింగ్ విజయవంతమైంది. ఈ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 62.1 కోట్ల మేర ప్రజాధనాన్ని ఆదా చేసింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది.

అయితే, వెలిగొండ రెండో టన్నెల్ పనుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది. రిత్విక్ సంస్థ 4.69 శాతం అధిక ధరకు పనులు దక్కించుకున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది.

ఇందులో భాగంగా రివర్స్ టెండరింగ్‌లో మేఘా సంస్థ రూ. 491.6కోట్లకు బిట్ దాఖలు చేసి ఎల్1గా నిలిచింది. రూ. 553.13 కోట్ల టెండర్‌ను 7 శాతం తక్కువకే మేఘా సంస్థ దక్కించుకుంది. దీంతో ప్రభుత్వ ఖాజానాకు 87 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రం పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో ఖజానాకు రూ. 782.8కోట్లు ఆదా అయ్యింది.

 ap govt big success in veligonda project reverse tendering process

30మందితో అధికార ప్రతినిధుల జాబితా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 30మందిని అధికార ప్రతినిధులుగా నియమించింది. ఆ జాబితాను శనివారం విడుదల చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కొత్త అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.

సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు చెందిన నేతలను అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించడం గమనార్హం. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలను ఈ అధికార ప్రతినిధులు మీడియాకు, ప్రజలకు తెలియజేయనున్నారు.

English summary
Andhra Pradesh Government big success in veligonda project reverse tendering process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X