వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా క్యాంటీన్లు మూయ‌టం లేదు: ప‌్ర‌క్షాళ‌న చేస్తున్నాం: శాస‌న‌స‌భ‌లో ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అన్నా క్యాంటీన్ల ప‌్ర‌క్షాళ‌న దిశగా జగన్ ప్ర‌భుత్వం || Anna Canteens Will Not Be Closed || Oneindia

ఏపీలో గ‌త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు ముత‌బ‌డుతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. దీని పైన ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ నుండి స్ప‌ష్ట‌త ఇచ్చింది. అన్నా క్యాంటీన్ల‌ను మూసివేసి..పేదవాడి కడుపుకొట్టే ఆలోచ న ప్రభుత్వానికి లేదని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే, ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న రంగు మాత్ర‌మే మారుస్తున్నామ‌ని తేల్చి చెప్పింది. ఇక‌..వీటి నిర్వ‌హ‌ణలోనూ అవినీతి చోటు చేసుకుంటుందం టూ వైసీపీ స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేసారు. పూర్తి ప్ర‌క్షాళ‌న చేసి క్యాంటీన్ల‌ను కొన‌సాగిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అన్నా క్యాంటీన్ల‌ను మూసివేయం..
టీడీపీ ప్ర‌భుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల పైన శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. గ‌త ప్ర‌భుత్వం అన్నా క్యాంటీ న్ల నిర్వ‌హ‌ణ కోసం అక్ష‌య ఫౌండేష‌న్‌తో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఈనెల 31తో ముగియ‌నుంది. దీని పైన ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టంతో ఇక అన్నా క్యాంటీన్లు మూసివేస్తున్నారంటూ ప్ర‌చారం సాగు తోంది. దీని పైన వైసీపీ స‌భ్యులు శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ప్రశ్నించారు. దీనికి స‌మాధానంగా మంత్రి బొత్సా ప్రస్తుతం ఏపీలో 183 అన్న క్యాంటీన్లు మాత్రమే నడుస్తున్నాయని బొత్స స్పష్టం చేశారు. ఓ లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆదరా బాదరాగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. క్యాంటీన్‌ రంగు మార్చితే పథకం రద్దు చేసినట్టు కాదని బొత్స స్పష్టం చేశారు. పేద‌వాడి పొట్ట క‌డుపుకొట్టే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని స్ప‌ష్టం చేసారు.

AP Govt clarified that Anna Canteens will not be closed and continue with few changes.

క్యాంటీన్ల‌ను ప్ర‌క్షాళ‌న చేస్త‌న్నాం
అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నార ని.. వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని..మార్చురీ పక్కన కూడా పెట్టారన్నాని మంత్రి బొత్సా స‌మాధానం ఇచ్చారు. ఇటు వంటి పరిస్థితుల్లో వాటిపై పూర్తి ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు బోత్స తెలి పారు. క్యాంటీన్ల‌కు రంగు మారుస్తే మూసివేసినట్లా అని ప్ర‌శ్నించారు. అయితే, అక్ష‌య ఫౌండేష‌న్‌తో ముగుస్తున్న కాంట్రాక్టు కొన‌సాగిస్తారా లేదా కొత్త వారికి అవ‌కాశం ఇస్తారా అనే దాని పైన మాత్రం స్ఫ‌స్ట‌త రాలేదు.

English summary
AP Govt clarified that Anna Canteens will not be closed and continue with few changes. YCP MLA's alleged corruption taken place in Anna Canteens.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X