వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, అక్రమాలు నిలదీసినందుకే జైలుకు తరలింపు: బుద్దా, గద్దె

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించారని ఆరోపించారు. సౌమ్యుడైన రవీంద్రపై కావాలనే అభియోగం మోపడం మంచి పద్ధతి కాదన్నారు. గురువారం బందర్‌లో కొల్లు రవీంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైరయ్యారు.

కావాలనే ఇరికించి..

కావాలనే ఇరికించి..

భాస్కర్ రావు హత్యకేసులో రవీంద్రను కావాలనే ఇరికించారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తమకు అనుమానం ఉందన్నారు. కొల్లు రవీంద్రకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అంతేకాదు అతని కుటుంబానికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది అని గుర్తుచేశారు.

సౌమ్యుడు..

సౌమ్యుడు..

ఇప్పుడే కాదు గతంలో కూడా కొల్లు రవీంద్రపై ఆరోపణలు లేవు అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. సౌమ్యుడు అని.. ఐదేళ్లు మంత్రిగా పనిచేసినా.. ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. అలాంటి వ్యక్తిపై హత్యాభియోగం మోపడం దారుణన్నారు. కొల్లు రవీంద్ర కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్యాయం జరిగితే నిలదీసినందుకే రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి.. జైలుకు తరలించారని విరుచుకుపడ్డారు.

Recommended Video

Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu
ప్రశ్నిస్తే.. కేసులు

ప్రశ్నిస్తే.. కేసులు


రాష్ట్రంలో ప్రశ్నించే వారిని ప్రభుత్వం కక్షసాధిస్తోందని వెంకన్న అన్నారు. ఇది సరికాదు అని.. అక్రమ కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరం చేసిన వారికి శిక్ష విధిస్తే ఓకే కానీ.. అన్యాయంగా కేసులలో ఇరికించడం సరికాదన్నారు. స్థానిక మంత్రి ఒత్తిడితో కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కానీ వారి కుట్రలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని బుద్దా వెంకన్న తెలిపారు.

English summary
andhra pradesh government conspiracy on ex minister kollu ravindra tdp mlc buddha venkanna alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X