వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు: పరీక్ష ఆధారంగానే..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ అంశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ నెలగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో భాగంగా జనవరి 2020 లో చేపట్టాల్సిన నియమకాల పైన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు..సచివాలయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం..ఇక కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల విషయంలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు అమలు చేస్తున్న విధానాలను సమీక్షించారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు..ఆరోపణలను పరిగణలోకి తీసుకొని సమూల మార్పులు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. మరింత పారదర్శకత దిశగా నిపుణులు చేసిన సూచనల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో..పాటుగా ఇక నుండి చేసే భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని నిర్ణయించారు. కేవలం రాత పరీక్ష ఆధారంగా నియమాలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇంటర్వ్యూలు లేవు..రాత పరీక్షలే..
ఏపీపీఎస్సీ జనవరి 2020 విడుదల చేయాల్సిన క్యాలెండర్ పైన ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో..ఆ తరువాత ఇంటర్వ్యూ సమయంలో అనుమానాలకు తావు లేకుండా పరీక్షలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ చేసే సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. గతంలో ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లు..పరీక్షలు..భర్తీ విషయంలో అనేక అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్లటం.. దీని ద్వారా ఉద్యోగాల భర్తీ అంశం నిలిచిపోవటం జరుగుతోందనే అంశం మీద ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చ చేసారు. ఆ తరువాత ఇక నుండి ఇటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగాలని స్పష్టం చేసారు.

AP Govt Decided to cancel interviews in reqruitment of APPSC jobs..selction on merit babis in written exam

ఇందులో ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్..మెయన్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని.. ఎక్కడా లోపాలు లేకుండా రాత పరీక్షలు నిర్వహించటం ద్వారా..ఇక , ఇంటర్వ్యూలకు అవకాశం ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. దీని ద్వారా అధికారం..పలుకుండి ఆధారంగా ఇంటర్వ్యూల్లో మార్కుల కోసం గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినట్లుగా అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం తో ఇక ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఐఐటీ..ఐఐఎం భాగస్వామ్యంతో పరీక్షలు..
అదే విధంగా.. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల సమయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీల సహకారం ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ తీసుకోవటం జరుగుతోంది. అయితే.. కీలక పరీక్షల్లో స్థానిక యూనివర్సిటీలతో పాటుగా ఐఐఎం..ఐఐటీల భాగస్వామ్యం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీని ద్వారా పరీక్షా నిర్వహణలో మరింత సమర్దవంతంగా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే సీఎం జగన్ ప్రతీ ఏటా జనవరిలో ప్రభుత్వ శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలతో జనవరి తొలి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

సాధ్యమైనంత త్వరగా పరీక్షలు..భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు..సచివాలయాల ఉద్యోగాల భర్తీ విషయంలో ఎంత ఒత్తిడి వచ్చినా..నిష్పక్షపాతంగా వ్యవహరించిన విధానం పైన ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అదే విధంగా లక్షలాది మంది యువత ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా ఉద్యోగాల నిర్వహణ పైన పక్కా ప్రణాళికతో మరోసారి సమీక్షకు రావాలని సూచించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానం రద్దు చేసిన ముఖ్యమంత్రి నిర్ణయం ద్వారా పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

English summary
CM Jagan Taken another key decision in Jobs reqruitment by APPSC. CM decided to cacel interviews in Reqruitment. only fill with written exams merit base.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X