వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం రమేష్ సీన్ రివర్స్ : టెండర్లు రద్దు చేసిన జగన్‌ సర్కార్‌: బీజేపీ నేతలు చెప్పినా..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు ఏపీ ప్రభుత్వం తొలి షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో భారీగా అంచనాలు పెంచుకొని గాలేరు-నగరి ఫేజ్‌-2 పనులను ప్రభుత్వం రద్దు చేసింది. రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో హడావుడిగా గత ప్రభుత్వం పనులను సీఎం రమేష్‌ కంపెనీకి కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధిక రేట్లకు పనులు అప్పగించడంతో సుమారు రూ.80 కోట్ల మేర ప్రభుత్వ ధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి పనుల వేగవంతానికి సిద్ధమవుతోంది.

<strong>నేడే ఏపీ క్యాబినెట్ భేటీ .. నూతన ఇసుక పాలసీ, ఆర్టీసీ విలీనం తదితర కీలక అంశాలపై చర్చ </strong>నేడే ఏపీ క్యాబినెట్ భేటీ .. నూతన ఇసుక పాలసీ, ఆర్టీసీ విలీనం తదితర కీలక అంశాలపై చర్చ

సీఎం రమేష్ కాంట్రాక్టు రద్దు..

సీఎం రమేష్ కాంట్రాక్టు రద్దు..

టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాంట్రాక్టర్లు పోటీకి రాకుండారూ.794 కోట్ల గాలేరు-నగరి పనులను రిత్విక్‌ కంపెనీ అధిక రేట్లకు దక్కించుకుంది. పని కోసం సదరు కంపెనీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హడావుడిగా గత ప్రభుత్వం పనులను సీఎం రమేష్‌ కంపెనీకి కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధిక రేట్లకు పనులు అప్పగించడంతో సుమారు రూ.80 కోట్ల మేర ప్రభుత్వ ధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గాలేరు-నగరి టెండర్లను సమీక్షించింది. పనుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకుంది. వెంటనే సదరు పని టెండర్లను రద్దు చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించింది. గాలేరు-నగరి పనులకు సంబంధించి రూ.795 కోట్లు పనులను గత ప్రభుత్వం ఎన్నికల చివరి నిమిషంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కంపెనీకి కట్టబెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి వారం రోజులముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పనులు దక్కించుకునేందుకు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టు పావులు కదిపింది.

ఎన్నికల ముందు పనుల అప్పగింత..

ఎన్నికల ముందు పనుల అప్పగింత..

అప్పటి సీఎంఓ జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను రిత్విక్‌కు కట్టబెట్టడంలో కీలక భూమిక పోషించారనే ఆరోపణలున్నాయి. అంతకుముందే గాలేరు-నగరిసుజలస్రవంతి రెండోదశ మొదటి ప్యాకేజీ ప్రధాన కాలువ 32.64కిమీ నుంచి 66.150 కి మీ వరకూ తవ్వాల్సి ఉంది. 10 వేల కరాలకు నీళ్లదించే డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు పనుల్లో 2014 నాటికి ుూ.69.89 కోట్ల విలువైన పనులు మిగిలాయి. రెండవ ప్యాకేజీ ప్రధాన కాలువ 66.15 కిమీ నుండి 96.50 వరకూ తవ్వకం చేపట్టాల్సి ఉంది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. రూ.110 కోట్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ ను బెదిరించి ఒప్పందం రద్దుకు (ప్రీ-క్లోజర్‌) గత సర్కార్‌ దరఖాస్తు చేయించింది. దీనిపై జలవనరుల శాఖతో ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు 2018-19 ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్స్‌) ఆధారంగా మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రెండు నెలల ముందు గాలేరు-నగరి రెండోదశ మొదటి ప్యాకేజీ పనులకు రూ. 391.31 కోట్లఅంచనాతో ప్రిబ్రవరి 11 ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)-ఓపెన్‌ పద్ధతిలో గత ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 25న టెక్నికల్‌ బిడ్‌ తెరిచారు. రిత్విక్‌ ప్రాజెక్ట్, ఎన్‌సీసీ, ఎమ్మార్‌కేఆర్, ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షెడ్యూల్లు్న దాఖలు చేశాయి. ఇందులో ఎమ్మార్‌కేఆర్,ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కు అర్హతలున్నా షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్‌సీసీ, రిత్విక్‌ ప్రాజెక్ట్‌ కంటే ఎక్కువ ధరకు షెడ్యూల్‌ దాఖలు చేసేలా పావులు కదిపారు.

ఎవరి సిఫార్సులు లెక్క చేయకుండా..

ఎవరి సిఫార్సులు లెక్క చేయకుండా..

సీఎం రమేష్ కు చెందిన సంస్థకు కేటాయించిన పనునలను రద్దు చేయటం పైన వైసీపీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి వద్దకు రాయబారాలు సాగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అవినీతి పైన సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని..తాను చెప్పినా వినే పరిస్థితి లేదని తేల్చ చెప్పారు. జలవనరుల శాఖ ప్రత్యేఖ అధికారి ఆదిత్యానాథ్‌ దాస్‌ ఎన్నికల ముందు టెండర్ల ద్వారా అప్పగించిన గాలేరు-నగరి మొదటి, రెండు ప్యాకేజీల కాంట్రాక్ట్‌ ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ రెండు ప్యాకేజీలకు గతంలో నిర్ణయించిన అంచనా విలువనే కాంట్రాక్ట్‌ విలువగా నిర్ణయించి ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించారు. రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో గాలేరు-నగరి రెండు ప్యాకేజీలకు రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

English summary
AP Govt decided to cancell the Tenders for Galru nagari and call for reverse tender. Previously These tenders allocated to CM Ramesh company Rithwik before last elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X