వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైతన్య‌..నారాయ‌ణ సంస్థ‌లే లక్ష్య‌మా: సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం : ఉల్లంఘిస్తే గుర్తింపు ర‌ద్దు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. విద్యను వ్యాపారమయం చేసి లాభా ర్జనే ధ్యేయంగా తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేటు.. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ముకుతాడు వేసేందుకు ఏకంగా బిల్లులు ప్ర‌తిపాదించారు. ఈ బిల్లుల‌కు ఈ రోజు శాస‌న‌స‌భ ఆమోద ముద్ర వేయ‌నుంది. దీని వెనుక అస‌లు ప్ర‌ధాన ఉద్దేశం రాష్ట్రంలో పేరున్న కార్పోరేట్ బ్యాచ్‌గా త‌య‌రై ల‌క్ష‌లాది ఫీజులు వ‌సూలు చేస్తున్న రెండు విద్యా సంస్థ ల పేర్లు వినిపిస్తున్నాయి. ట్రస్టుల పేరిట లాభాపేక్ష లేకుండా విద్యా సంస్థలను నిర్వహించాల్సిన ఆ కార్పొరేట్‌ సంస్థ లు కోట్ల రూపాయల లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం వీటి నియంత్ర‌ణ‌కు హైకోర్టు జ‌డ్జీలుగా క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తోంది.

ఆ రెండు విద్యా సంస్థ‌లే ల‌క్ష్య‌మా..

ఆ రెండు విద్యా సంస్థ‌లే ల‌క్ష్య‌మా..

జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యం నుండి విద్యా వ్య‌వ‌స్థ పైన చ‌ర్చ జ‌రిగిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ అధిక ఫీజుల గురించి ప్ర‌స్తావించేవారు. అదే స‌మ‌యంలో చైత‌న్య‌..నారాయ‌ణ సంస్థ‌లు ట్ర‌స్ట్ పేరుతో ఏర్పాటై ల‌క్ష‌లాది ఫీజులు వ‌సూలు చేస్తున్నాయ‌ని ఓపెన్‌గానే విమ‌ర్శించారు. ఇక‌, నారాయ‌ణ సంస్థ‌ల్లో చోటు చేసుకున్న విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య ల గురించి ప‌లుమార్లు వైసీపీ శాస‌న‌స‌భ్యులు స‌భ‌లోనే ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. గ‌త ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసిన నారాయ‌ణ‌కు చెందిన ఈ విద్యా సంస్థ‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్ధులు ఆత్య‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఇక‌, ఈ విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం స‌మ‌యంలోనూ అనుమ‌తి లేకుండా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న చైత‌న్య‌.. నారాయ‌ణ సంస్థ‌ల‌కు చెందిన వాటి పైన ప్ర‌భుత్వం జ‌రిమానా విధించింది. ట్ర‌స్ట్ పేరుతో అనుమ‌తులు తీసుకున్న త‌రువాత లాభాపేక్ష లేకుండా విద్యను అందించాల్సి ఉంటుంది. అయితే, ర్యాంకుల ఆశ చూపి ల‌క్ష‌లాది రూపాయల ను వ‌సూలు చేస్తున్నారు. ల‌క్ష‌లాది మంది విద్యార్ధులు ఈ సంస్థ‌ల్లో చ‌దువు కుంటున్నారు. దీంతో..వారి మీద ప్ర‌భావం ప‌డ‌కుండా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించింది.

అసెంబ్లీలో రెండు బిల్లులు..

అసెంబ్లీలో రెండు బిల్లులు..

కార్పోరేట్..ప్ర‌వేటు విద్యా సంస్థ‌ల నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం రెండు కీల‌క బిల్లుల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెడుతోంది.
పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ బిల్లు ఒకటి కాగా.. రెండోది ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ బిల్లు. పాఠ శాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుతో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుండగా, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుతో ఏటా 25 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. కార్పొరేట్‌ విద్యాసంస్థ లు చెప్పిందే వేదంగా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. పాలకులే తమ బినామీ పేరిట ఈ కార్పొరేట్‌ సంస్థలను ఏర్పాటుచేస్తుండడంతో వీటి ఆగడాలకు అంతేలేకుండాపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టి న ఈ బిల్లులతో వీటి దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. కొత్త విధానంలో ఇంటర్మీడియెట్‌ విద్యను ఉన్నత విద్య పరిధిలోకి తెస్తున్నారు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ కాలేజీల వ్యవహరాలను పరిశీలిస్తుంది. ఈ బిల్లుల ద్వారా కమిషన్‌ ఏర్పాటుతో వాటికీ అడ్డుకట్ట పడనుంది.

 ప్ర‌త్యేక క‌మిష‌న్ల ఏర్పాటు..

ప్ర‌త్యేక క‌మిష‌న్ల ఏర్పాటు..

ప్రతి విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అన్ని మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూలు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు ఈ బిల్లుల ద్వారా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేయనున్నారు. పాఠశాల విద్య నియం త్రణ.. పర్యవేక్షణ.. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు కానున్నాయి. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు ఈ కమిషన్లకు చైర్మన్లుగా ఉంటారు. ఆయా రంగాల్లో నిపుణులు, మేథావులను సభ్యులుగా నియమించనున్నా రు. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటుచేస్తుంది. నిబంధనలు అసలు పాటించని సంస్థల గుర్తింపును సైతం రద్దుచేస్తుంది. సివిల్‌కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది.

English summary
AP Govt decided to control private and corporate school robbery by name of tution fee. To day in Assembly two bills may pass regarding control privates educational institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X