వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్ర‌ప‌ద‌వులే కాదు..నామినేటెడ్ పోస్టులు సిద్దం: పాల‌క‌మండ‌ళ్లు ర‌ద్దు: జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీలో ప‌దువుల పందేరం మొద‌లైంది. మంత్రి ప‌ద‌వులే కాదు..నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ముందుగా మంత్రి ప‌ద‌వులు..ఆ వెంట‌నే నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేయాల‌ని జ‌గ‌న నిర్ణ‌యించారు. మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేని ముఖ్య నేత‌ల‌కు నామినేటెడ్ పోస్టుల్లో కీల‌క‌మైవ‌ని అప్ప చెప్పే విధంగా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇందు కోసం ఈ నెల 8వ తేదీ ముహూర్తంగా నిర్ణ‌యించారు. ఆ రోజు జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో ప్ర‌స్తుత పాల‌క మండ‌ళ్లను ర‌ద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నారు.

మంత్రి ప‌ద‌వులు రాని వారికి..
వైసీపీలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెల‌వ‌టంతో మంత్రి ప‌ద‌వులకు డిమాండ్ పెరిగింది. దీంతో.. మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని వారికి కీల‌క‌మైన నామినేటెడ్ ప‌దవులు ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీల‌తో స‌మావేశం ఏర్పాటు చేసారు. ఆ స‌మావేశంలో తన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఎవ‌రికి అవకాశం ఇచ్చేదీ వివ‌రించ‌టంతో పాటుగా తాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌దీ విశ్లేషించ‌నున్నారు.

AP Govt decided to dissolve all Temple trust boards which nominated by previous govt by an ordinance

అదే స‌మ‌యం లో తాను ఎవ‌రినీ ఉద్దేశ పూర్వ‌కంగా విస్మ‌రించ‌లేద‌నే విష‌యం వివ‌రిస్తూనే.. మంత్రిగా అవ‌కాశం ద‌క్క‌ని వారికి కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌నున్నారు. దీని కోసం ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న 272 నామినేటెడ్ పోస్టుల‌ను ఏ క్ర‌మంలో భ‌ర్తీ చేసేదీ వివ‌రించ‌నున్నారు. దీనికి తొలి అడుగుగా గ‌త ప్ర‌భుత్వంలో నియ‌మితులై..ఇప్ప‌టికీ రాజీనామా చేయ‌ని వారి విష‌యం లో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.

పాల‌క మండ‌ళ్లు ర‌ద్దు..
రాష్ట్రవ్యాప్తంగా టీటీడీ సహా మిగిలిన దేవాలయాల్లో పాలకమండళ్ల రద్దుకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. చట్టప్రకారం పాలకమండలి చైర్మన్‌ను లేదా సభ్యులను తొలగించాలంటే ముందుగా వారికి తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలి. కానీ, ఈ లోపే ఆ నోటీసులపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. నోటీసులు అందుకున్న వారు కోర్టుకు వెళ్తే ప్రభుత్వం అనుకున్నది నెరవేరకపోగా, మొత్తం ప్రక్రియ కోర్టు పరిధిలోకి వెళ్లిపోతుంది.

దీనిని దృష్టిలో ఉంచుకొని ఒకే ఒక ఆర్డినెన్స్‌ ద్వారా రాష్ట్రంలో పాలకమండళ్లను రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఏపీ చారిటబుల్‌, హిందూ రిలీజియస్‌ ఇనిస్టిట్యూషన్స్‌, ఎండోమెంట్స్‌ చట్టం - 1987ను సవరించడం ద్వారా ఆర్డినెన్స్‌ను అమ‌ల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. 1987 చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదించి, ఆ సవర ణలకు తగిన విధంగా పాలకమండలిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను ప్రభుత్వం కోరనుంది.
దీని ద్వారా కొత్త‌గా వైసీపీ నేత‌ల‌ను పోస్టుల్లో నియామ‌కానికి అవకాశం ద‌క్క‌నుంది.

English summary
AP Govt decided to dissolve all Temple trust boards which nominated by previous govt by an ordinance. On 8th of this month in AP first cabinet meeting govt may take this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X