వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం- ఉద్యోగ సంఘాలతో జగన్..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో మార్చినెల జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఉంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు తెలిపారు.

 ఏపీ ఆదాయానికి కరోనా గండి..

ఏపీ ఆదాయానికి కరోనా గండి..

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వశాఖల నుంచి వచ్చే ఆదాయనికి తీవ్రంగా గండిపడింది. నెలనెలా రావాల్సిన పన్నులతో పాటు మైనింగ్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఆదాయాలు కూడా నిలిచిపోయాయి. దీంతో వేల కోట్ల రూపాయల రాబడి పోయినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నుంచి తాజా వివరాలు తీసుకున్న ప్రభుత్వం రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రావడం లేదని తేల్చింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఉద్యోగుల వేతనాలు, జీతాలు, పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.

రెండు విడతల్లో జీతాలు, వేతనాలు, పింఛన్లు..

రెండు విడతల్లో జీతాలు, వేతనాలు, పింఛన్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులను, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీన సగం, నెలాఖరులోపు మరో సగం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇవాళ క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణతో సీఎం జగన్ చెప్పారు.

క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ తర్వాత బయటికి వచ్చిన సూర్యనారాయణ.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రస్తుతం ఏమి బాగోలేవని, లాక్ డౌన్ కారణంగా రోజుకి రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రాని పరిస్థితిఉందన్నారు.మార్చ్ నెల జీతాలు ఇవ్వాల్సిన టైం కూడా వచ్చిందని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మార్చ్ నెల జీతాన్ని రెండు దఫాలుగా ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగుల మద్దతు..

ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగుల మద్దతు..

ఏపీలో కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చినేల జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలన్న నిర్ణయం తమకు ఆమోదయోగ్యమేనని ఉద్యోగులు చెబుతున్నారు. తెలంగాణ తరహాలో కోతలు పెట్టకుండా రెండు విడతల్లో ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉద్యోగసంఘాల తరఫున 100 కోట్ల నిధులను సేకరించి ప్రభుత్వానికి ఇచ్చామని, భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు కృషి చేస్తామని వారు చెప్తున్నారు.

English summary
AP govt decided to give march month salaries in two terms to its employees and pensioners in the state. due to coronavirus breakdown and lock down affect state govt's revenues also decreased. cm jagan assured employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X