DSC -2025 నియామక పత్రాల జారీ వేళ కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపైన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల జారీ ముహూర్తం ఖరారైంది. మొత్తంగా 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదల కానుంది. 19న అమరావతిలో సభ ఏర్పాటు చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వీరికి దసరా సెలవుల్లో శిక్షణ ఇచ్చి... ఆ తరువాత విధుల్లో చేరేలా కార్యాచరణ ఖరారు చేసారు.
డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టింగ్స్ పై ఏపీ విద్యాశాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 15న ఎంపికైన తుది జాబితా ప్రకటించనుంది. ఈ నెల 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే 19వ తేదీన సభ నిర్వహించి.. అక్కడే ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అమరావతితో సచివాలయం సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంపికైన అభ్యర్ధుల జాబితాలను మరోసారి అధికారులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. వీటిని ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేసి జాబితాలను జిల్లాలకు పంపి డీఎస్సీ కమిటీలతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15న తుది జాబితాలు ప్రకటిస్తారు. 19న వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నారు. అప్పాయింట్ మెంట్ లెటర్స్ అందుకున్న వారికి దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. సెలవుల్లో శిక్షణ పైన అభ్యంతరాలు వస్తే ఆ తరువాత ట్రైనింగ్ పూర్తి చేయాలనే మరో ప్రతిపాదన సిద్దం చేసారు. దసరా సెలవుల తరువాత ఆక్టోబర్ 3వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే కొత్తగా టీచర్ ఉద్యోగాలు పొందిన వారు విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.












Click it and Unblock the Notifications