వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం వ‌ద్ద‌న్నా..జ‌గ‌న్‌ డోన్ట్ కేర్‌: చంద్ర‌బాబును వ‌దిలేది లేదు: విచార‌ణ‌లో ముందుకే...!

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌ని చెప్పింది. ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం డోన్ట్ కేర్ అంటున్నారు. విచార‌ణ జ‌ర‌గాల్సిందేన‌ని నిర్ణ యించారు. స్వ‌యంగా కేంద్ర మంత్రి నాటి చంద్ర‌బాబు హాయంలో జ‌రిగిన ఒప్పందాల‌పైన విచార‌ణ కొన‌సాగించా ల్సిందేన‌ని నిర్ణ‌యించింది. కేంద్రం రాసిన లేఖ‌ను ప‌ట్టించుకోవాల్సిన అస‌వ‌రం లేద‌ని డిసైడ్ అయింది. దీంతో.. అస‌లు ఆ ఒప్పందాల వెనుక జ‌రిగిన అస‌లు విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. ఏపీకి మిగులు విద్యుత్ ఉంద‌ని..విద్యుత్ గురించి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది.

Recommended Video

రైతుల పై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్
 విచార‌ణ వ‌ద్దంటూ కేంద్రం సూచ‌న‌

విచార‌ణ వ‌ద్దంటూ కేంద్రం సూచ‌న‌

చంద్రబాబు హాయాంలో జ‌రిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల మీద విచార‌ణ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో వెంట‌నే కేంద్ర ఇంధ‌న కార్య‌ద‌ర్శి ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ రాసారు. పీపీఏల మీద విచార‌ణ చేస్తే అది మొత్తంగా ఒప్పందాల మీద‌నే ప్ర‌భావం ప‌డుతుంద‌ని హెచ్చరించారు. ఇదే విష‌యాన్ని నేరుగా తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీకి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివ‌రించారు. కేంద్రం నుండి వ‌చ్చిన లేఖ‌ను ప్ర‌స్తావించారు. అవినీతి జ‌రిగి ఉంటే ఖ‌చ్చితంగా విచార‌ణ చేయాల్సిందేన‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. దీంతో..ముఖ్య‌మంత్రి విచార‌ణ కోసం క‌మిటీ ఏర్పాటు చేసారు. తాజాగా.. ఏకంగా కేంద్ర ఇంధ‌న‌శాఖా మంత్రి ఏపీ సీఎంకు లేఖ రాసారు. విచార‌ణ వ‌ద్ద‌ని సూచించా రు. విచార‌ణ కార‌ణంగా మొత్తంగా విద్యుత్ కాంట్రాక్ట‌రీ వ్య‌వ‌స్థ మీదే ప్ర‌భావం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. దీంతో.. ఏపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుందా అనే ఉత్కంఠ మొద‌లైంది.

అసద్ సాబ్.. వినడం నేర్చుకోండి, ఎన్ఐఏ సవరణ బిల్లు సందర్భంగా అమిత్ షా <br /> అసద్ సాబ్.. వినడం నేర్చుకోండి, ఎన్ఐఏ సవరణ బిల్లు సందర్భంగా అమిత్ షా

విచార‌ణ సాగిస్తాం..కేంద్రం అభ్యంత‌రం స‌హేతుకం కాదు..

విచార‌ణ సాగిస్తాం..కేంద్రం అభ్యంత‌రం స‌హేతుకం కాదు..

కేంద్ర మంత్రి రాసిన లేఖ‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగం గా చంద్ర‌బాబు హయాంలో జ‌రిగిన ఒప్పందాల మీద విచార‌ణ కొన‌సాగించాల‌ని డిసైడ్ అయింది. ముఖ్య‌మంత్రి ఈ అంశం మీద స‌మ‌క్ష త‌రువాత రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు అజ‌య్ క‌ళ్లాం మాట్లాడుతూపీపీఏల రద్దు వల్ల పెట్టు బడులు రావని తప్పుడు ప్రచారం జరుగుతోందని.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలని ఏపీ సీఎం ఉద్దేశ‌మ‌ని స్పష్టం చేశారు. పారదర్శక ఒప్పందాల కోసం సీఎం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తం గా సౌర, పవన్‌ విద్యుత్ ధరలు తగ్గాయన్నారు. 2018లో రూ.18 ఉన్న సోలార్ యూనిట్ ధర రూ.2.45కి పడిపోయిందని.. అయితే పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.20 నుంచి 40 పైసలకు పడిపోయిందన్నారు. అయితే ఏపీలో సరిపోయేంత విద్యుదుత్పత్తి ఉందని అజయ్‌కల్లాం స్పష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో మొత్తం 133 పీపీఏలు ఉండ‌గా...అందులో అయిదు పీపీఏలే 70 శాతం మేర ద‌క్కించుకున్నాయ‌ని చెప్పుకొచ్చారు.

డిస్కింల చాటున అక్ర‌మాలు చేసారు..

డిస్కింల చాటున అక్ర‌మాలు చేసారు..

గ‌త ప్ర‌భుత్వ హాయంలో యూనిట్ ఆరు రూపాయ‌ల వ‌ర‌కు కొనుగోలు చేసార‌ని ప్ర‌భుత్వ వివ‌రిస్తోంది. ఇదే స‌మ‌యం లో డిస్కింలు 20 వేల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయ‌ని అజ‌య్ క‌ళ్లం స్పష్టం చేసారు. ఎక్కువ ధ‌ర‌కు కొన‌టం వ‌ల‌న రాష్ట్ర ఆదాయానికి భారీగా న‌ష్టం క‌లిగింద‌ని వివ‌రించారు. విద్యుత్ భారాన్ని కొత్తగా వ‌స్తున్న ప‌రిశ్ర‌మ‌ల పైన మోప‌లేమ ని తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు కేంద్రం సూచ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబు హాయంలో జ‌రిగిన ఒప్పందాల‌ను స‌మీక్షించాల‌నే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త‌మ సూచ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టి ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం విచార‌ణ కొన‌సాగించాల‌నే నిర్ణ‌యం పైన కేంద్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
AP Govt decided to step forward in PPA's investigation which taken in Chandra babu tenure. Govt decided to not consider Central govt objections on this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X