వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరెంటు బిల్ చెల్లింపు గడువు పెంపు- మార్చి బిల్లు మొత్తమే ఏప్రిల్ కూ వర్తింపు...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విద్యుత్ సంస్ధలకు చెల్లించాల్సిన కరెంటు బిల్లుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరెంటు బిల్లుల చెల్లింపులో వినియోగదారులకు వాయిదాతో పాటు మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్ర్రాలకు సూచించిన నేపథ్యంలో ఏపీ సర్కారు తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం మార్చినెల బిల్లుల చెల్లింపు గడువుతో పాటు మరికొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో వీటిని తక్షణం అమల్లోకి తీసుకొచ్చారు.

 కరెంటు బిల్లు చెల్లింపు గడువు పెంపు..

కరెంటు బిల్లు చెల్లింపు గడువు పెంపు..

కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఏపీలోని ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వచ్చే చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరెంటు బిల్లుల చెల్లింపు గడువును వాయిదా వేశారు. ఈ ఎనిమిది జిల్లాల్లోనూ మార్చినెలకు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ఏప్రిల్ 18 వరకూ కట్టొచ్చని ఎస్పీడీసీఎల్ అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఈ బిల్లుల చెల్లింపు గడువు మార్చిలోనే ముగిసింది. అయినా బిల్లుల చెల్లింపు సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 మార్చి బిల్లే ఏప్రిల్ నెలకూ..

మార్చి బిల్లే ఏప్రిల్ నెలకూ..

మార్చి నెలలో వినియోగదారులకు వచ్చిన బిల్లు మొత్తాన్నే ఏప్రిల్ బిల్లుగానూ వర్తింప జేయాలని ఏపీఎస్పీడీసీఎల్ మరో నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మార్చి నెలలో ఎంత బిల్లు వస్తుందో అదే మొత్తాన్ని ఏప్రిల్ బిల్లుగా కట్టించుకుంటారు. కొత్తగా ఏప్రిల్ బిల్లును వినియోగదారులకు సెల్ ఫోన్లకే పంపిస్తారు. వీటి ఆధారంగా బిల్లును చెల్లించవచ్చు. ఏప్రిల్ బిల్లులు ఎప్పటి వరకూ చెల్లించవచ్చనేది ప్రభుత్వం స్పష్టం చేయలేదు. దీంతో ఈ గడువు కూడా పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

 బిల్లు తీసే వారే లేరు..

బిల్లు తీసే వారే లేరు..

మార్చినెలలో ఎంత బిల్లు వచ్చిందో అంతే మొత్తాన్ని ఏప్రిల్ నెల బిల్లుగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణం కరెంటు బిల్లులు తీసే పరిస్ధితి లేకపోవడమే. లాక్ డౌన్ కారణంగా కరెంటు బిల్లులు తీసేందుకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ముందుకు రాలేని పరిస్దితి. దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా మార్చి బిల్లు మొత్తాన్నే ఏప్రిల్ కూ కట్టాలని వినియోగదారులకు సూచిస్తోంది.

Recommended Video

14 Positive Cases in AP's West Godavari District Linked With Markaz Prayers | People Quarantined
 ఏపీఈపీడీసీఎల్ పరిధిలోనూ..

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోనూ..

కరెంటు బిల్లుల చెల్లింపు గడువుతో పాటు ఇతర మినహాయింపులను ఎస్పీడీసీఎల్ ప్రకటించడంతో గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోకి వచ్చే ఈపీడీసీఎల్ కూడా ఇదే నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ విధానం ఒకటే ఉంటుంది కాబట్టి ఈ ఐదు జిల్లాల్లోనూ అవే మినహాయింపులు అమల్లోకి రానున్నాయి.

కరోనా దృష్ట్యా ఏపీఎస్పీడీసీఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

మర్చినెలలో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి వచ్చిన బిల్లునేఏప్రిల్‌ బిల్లుకూవర్తింపజేయాలని నిర్ణయించింది.

వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు పంపనున్నట్లు చెప్పింది.

ఈనెల 18 వరకు అపరాధ రుసుములేకుండా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రకటించింది.

ఈ మార్పును ఎనిమిది జిల్లాల ప్రజలు గమనించాలని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు తెలిపారు.

English summary
due to coronavirus lock down andhra pradesh govt decided to extends march month power bill payments due date to april 18th. southern power distribution company limited announced to implement the same in 8 districts. according to latest decision spdcl to levy march bill payment amount to april month also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X