వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి ర‌హిత పాల‌న‌:జ‌గ‌న్ అన్న అమ్మ ఒడిగా పేరు ఖ‌రారు : 2.27 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలి బ‌డ్జెట్ ను శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది. తొలి బ‌డ్జెట్‌లో చెప్పిన‌ట్లుగానే సంక్షేమం.. న‌వ ర‌త్నాల‌కు అధిక కేటాయింపులు చేసారు. ప్ర‌ధానంగా విద్య శాఖ‌కు..పంచాయితీ రాజ్..గ్రామీణాభ‌వృద్దికి భారీగా కేటా యింపులు చేసారు. సీఎం ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌ధ‌కం అమ్మ ఒడి కోసం భారీగా నిధులు కేటాయించారు. అదే విధంగా అన్ని వ‌ర్గాల అభివృద్దికి నిధులు ప్ర‌తిపాదించారు. ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా టోకేన్ కింద వెయ్యి కోట్లు కేటాయించారు. ఇక‌, మొత్తంగా రూ. 2,27,974 ఓట్లుగా ప్ర‌తిపాదించారు. రెవిన్యూ లోటు 1778.52 కోట్లుగా అంచ‌నా వేసారు.

అమ్మ ఒడికి జ‌గ‌న్ పేరు..

అమ్మ ఒడికి జ‌గ‌న్ పేరు..

వైసీపీ ప్ర‌భుత్వం తొలి బ‌డ్జెట్‌లో విద్యా శాఖ‌కు భారీగా కేటాయింపులు చేసారు. విద్యా శాఖ కోసం రూ. 32,618 కోట్ల‌ను ప్ర‌తిపాదించారు. అందులో పాఠశాల‌ల మౌళిక వ‌స‌తుల అభివృద్ది కోసం రూ. 1500 కోట్లు కేటాయించారు. దీని త‌రువా త పంచాయితీ రాజ్..గ్రామీణాభివృద్దికి పెద్ద మొత్తంలో నిధులు ప్ర‌తిపాదించారు. ఈ రెండు శాఖ‌ల‌కు 31,564 కోట్ల‌ను బ‌డ్జెట్‌లో కేటాయించారు. అమ్మ ఒడి ప‌ధ‌కానికి 6455 కోట్లు కేటాయించారు. దీని ద్వారా ఒక‌టో త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకొనే పిల్ల‌ల త‌ల్లుల‌కు ఈ మొత్తం అందుతుంది. మొత్తంగా 43 లక్ష‌ల మందికి ప్ర‌యోజ‌నం జ‌రుగుతుం ని అంచ‌నా వేసారు. ఈ ప‌ధ‌కానికి జ‌గ‌న్ పేరు పెడుతున్న‌ట్లు ఆర్దిక మంత్రి ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి అంగీక‌రించ‌క పోయినా..తామంతా క‌లిసి ఒప్పంచామ‌ని వివ‌రించారు. అదే విధంగా జ‌గ‌న్ అన్న దీవెన పేరుతో మ‌రో ప‌ధ‌కాన్ని సైతం అమ‌లు చేస్తున్న‌ట్లు ఆర్దిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో స్ప‌ష్టం చేసారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్య‌త‌..

తొలి నుండి చెబుతున్న‌ట్లుగా జ‌గ‌న్ త‌న తొటి బ‌డ్జెట్‌లో వ్య‌వ‌సాయ రంగానికి భారీగా కేటాయింపులు చేసారు, గ‌తం కంటే ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ప్ర‌క‌టించారు. ఇందు కోసం వ్యవసాయ రంగానికి రైతు సంక్షేమం లో ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు..ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు..వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు..రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు కేటాయించారు. వ్య‌వ‌సాయం కోసం మొత్తంగా ఈ బ‌డ్జెట్ లో..అనుబంధ రంగాల‌తో క‌లిపి 20,677 కోట్లు ప్రతిపాదించారు. కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తామ‌ని..సాగునీటి ప్రాజెక్టుల ను సకాలంలో పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రైతు భ‌రోసా కింద 8750 కోట్లు ప్ర‌తిపాదించారు. దీని ద్వారా దాదాపు 64.06 ల‌క్ష‌ల మంది రైతులకు ల‌బ్ది చేకూర‌నుంది. వీరిలో కౌలు రైతులు కూడా ఉన్నారు. దేశంలోనే తొలి సారిగా కౌలు రైతు ల‌కు సైతం అమ‌లు చేయ‌టం రికార్డుగా ఆర్దిక మంత్రి చెప్పుకొచ్చారు.

Recommended Video

సంక్షేమానికి బడ్జెట్ లో పెద్దపీట
సంక్షేమ రంగానికి సైతం...

సంక్షేమ రంగానికి సైతం...

సంక్షేమ రంగానికి సైతం ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున నిధుల‌ను ప్ర‌తిపాదించింది. ప‌ట్ట‌ణాభివృద్దికి 6587 కోట్లు కేటాయించా రు. కాపు సంక్షేమానికి రెండు వేల కోట్లు ప్ర‌క‌టించారు. చేనేత సంక్షేమానికి 200 కోట్లు.. బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్‌కు 100 కోట్లు.. న్యాయ‌వాదుల ట్ర‌స్ట్ కు 100 కోట్లు..ర‌జ‌కులు-నాయి బ్రాహ్మ‌ణుల‌కు ప్ర‌త్యేకంగా నిధులు ప్ర‌స్తావించారు. ఇక‌, బీసీ -ఎస్సీ- ఎస్టీ సంక్షేమ రంగానికి భారీగా నిదులు కేటాయించిన‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. బీసీ..ఎస్సీ..ఎస్టీల‌కు పెళ్లి కానుక కింద నిధుల‌ను ప్ర‌తిపాదించారు. కులాంత‌ర వివాహ ప‌ధ‌కానికి నిధుల‌ను కేటాయించారు. ఇక‌, గిరిజ‌న సంక్షేమానికి 4988 కోట్లు కేటాయింపు జ‌రిగింది. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ‌కు ప్రాధాన్య‌త ఇస్తూ రూ. 11,399 కోట్లు కేటాయింపు చేసారు. ఇక‌, అయిదు లక్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రినీ ఆరోగ్య శ్రీ ప‌ధ‌కం కింద‌కు తుస్తూ యూనిక్ కార్డు అందుబాటులోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆరోగ్య శ్రీ కోసం రూ. 1740 కోట్లు కేటాయించారు.

English summary
AP Govt Finance Minister Rajendra Nath proposed Budget in Assembly with 2.27 cr lakhs. Govt given top priority for Welfare and Education. Minister Announced Jagan name for Amma Vadi scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X