• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ఇసుక ధరలు ఫిక్స్: కొత్త రేట్లు ఇవే: టన్నుకు ఎంత వసూలు చేస్తారంటే?

|

అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసిన తరువాత..ఇసుక తవ్వకాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించినా..అది అంచనాలను అందుకోలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇసుక సరఫరాపై అధికార పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇసుక సరఫరా అనేది కొరుకుడు పడని వ్యవహారంగా మారిందంటూ ప్రభుత్వ పెద్దలూ చెప్పుకొన్నారు.

తెలంగాణలో తగ్గినట్టే తగ్గి: అదే ఉదృతి: కొత్త కేసులతో కలవర పాటు: ఇప్పటికింతే అనేలా!

తవ్వకాలు, రేట్లు, రవాణా.. వంటి అంశాలన్నీ విమర్శలను ఎదుర్కొన్నాయి. ఇంటిని కట్టుకోవడానికి అన్నీ సమకూరినా.. ఇసుక సకాలంలో అందబాటులో రావట్లేదని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ రోజుల తరబడి ఎదుచు చూడాల్సిన దుస్థితి ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సైతం వ్యాఖ్యానించిన సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను క్రమబద్దకరించడానికి చర్యలు తీసుకుంది. వాటి రేట్లనూ నిర్ధారించింది.

 AP Govt Fixing of Base Rates for various activities relating to Sand

ఇసుక తవ్వకాలు మొదలుకుని డోర్ డెలివరీ దాకా ప్రత్యేక ధరలను నిర్ధారించింది. ఆ రేట్లకు మించి ఎక్కువగా వసూలు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామనీ హెచ్చరించింది. ఇసుక రేట్లను నిర్ధారిస్తూ గనులు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులను జారీ చేశారు. ఇసుక తవ్వకాలు, మ్యానువల్ లోడింగ్, జేసీబీ ద్వారా లోడింగ్, రవాణా, స్టాక్ యార్డులు, డిపోలు, వినియోగదారులకు డోర్ డెలివరీ చేయడంపై రేట్లను ఫిక్స్ చేసింది. రవాణా సమయంలో కిలోమీటర్‌కు ఎంత వసూలు చేయాలనేది నిర్ధారించింది. శ్లాబుల వారీగా రవాణా రేట్లను ప్రకటించింది.

ఓపెన్ రీచ్, పట్టాదారు భూముల్లో ఇసుకను తవ్వడానికి టన్ను ఒక్కింటికి 90 రూపాయలను ఫీజుగా నిర్దారించారు. జేసీబీ ద్వారా ఇసుకను ట్రాక్టర్ లేదా, ఇతర వాహనాల్లో లోడ్ చేయాల్సి వస్తే.. టన్నుకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుకను రవాణా చేసే సమయంలో కిలోమీటర్ ఒక్కింటికి 4.90 పైసలను వసూలు చేస్తారు. విశాఖపట్నానికి ఇసుకను తరలించడానికి కిలోమీటర్‌కు 3.30 పైసల ఛార్జి తీసుకుంటారు.

  వైజాగ్, కొండపల్లి లో Ammonium Nitrate నిల్వల పై అశ్రద్ద వద్దు | Pawan Kalyan | Lebanon | Beirut

  ఇసుకను ట్రాక్టర్ ద్వారా 40 కిలోమీటర్ల లోపు దూరానికి తరలించడానికి కిలోమీటర్‌కు 10 రూపాయలను వసూలు చేస్తారు. ఆరు టైర్ల ఉన్న ట్రక్కుల్లో తీసుకెళ్లడానికి ఎనిమిది రూపాయలు, 10 టైర్లు ఉన్న వాహనాల ద్వారా చేరవేయడానికి ఏడు రూపాయల ఛార్జీని వసూలు చేస్తారు. ఇసుకను లోడ్ చేసిన ప్రదేశం నుంచి 40 కిలోమీటర్ల వరకూ ఇవే రేట్లు వర్తిస్తాయి. 40 కిలోమీటర్ల దూరాన్ని మించితే.. కిలోమీటర్‌ ఒక్కింటికి 4.90 పైసలను వసూలు చేస్తారు. అన్ని రకాల వాహనాలకూ ఇవే ధరలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

  English summary
  Government of Andhra Pradesh headed by Chief Minister YS Jagan Mohan Reddy fixing of Base Rates for various activities relating to Sand like sand extraction, loading, transportation, internal transport and door delivery, Orders Issued by the Mining department.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X