అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పునాదులు క‌దులుతున్నాయి: సీబీఐకి ఏపీలో గ్రీన్ సిగ్న‌ల్: తొలి టార్గెట్ ఫిక్స్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీబీఐక అనుమ‌తి ఇస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర హోం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏపీలో సీబీఐకు సాధార‌ణ అనుమ‌తిని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఆ ఉత్త‌ర్వులను ర‌ద్దు చేస్తూ సీబీఐకి సాధార‌ణ అనుమ‌తిని పున‌రుద్ద‌రించారు. దీని ద్వారా సీబీఐ విచార‌ణ‌కు ఏపీలో అవ‌కాశం ఏర్ప‌డుతుంది. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగానే సీబీఐకు అనుమ‌తి ఇచ్చార‌ని..ఆయ‌న తొలి ల‌క్ష్యాన్ని సైతం నిర్ధేశించుకున్నార‌ని చెబుతున్నారు. మ‌రి..ఆయ‌న ల‌క్ష్యం ఏంటి..

సీబీఐకి గ్రీన్ సిగ్న‌ల్..

సీబీఐకి గ్రీన్ సిగ్న‌ల్..

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ‌తంలో సీబీఐకు సాధార‌ణ అనుమ‌తి ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం మీద పోరాడుతున్న త‌మ పైన సీబీఐను దుర్వినియోగం చేసే అవ‌కాశం ఉందంటూ ఆ నిర్ణ‌యం అమ‌ల్లోకి తెచ్చింది. అయితే ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాగానే..ఆ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌ర్వులను ర‌ద్దు చేస్తూ..తిరిగి ఏపీలో సీబీఐకు అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసారు. అయితే, పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన వారం రోజుల్లోనే ఇంత వేగంగా సీబీఐ విష‌యంలో నిర్ణ‌యం తీసుకున్నారంటే దీని వెనుక సీఎం జ‌గ‌న్ ప‌క్కా ప్రణాళిక‌ల‌తోటే ఉన్నార‌నే విష‌యం అర్ద‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ప‌ట్టిసీమ‌..రాజ‌ధాని భూములు..పోల‌వ‌రం అక్ర‌మాలు..అగ్రిగోల్డ్ వంటి అంశాల పైన జ‌గ‌న్ సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్ చేసారు. అయినా టీడీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు.

తొలి టార్గెట్ ఫిక్స్‌...

తొలి టార్గెట్ ఫిక్స్‌...

సీబీఐకు ఏపీలో అనుమ‌తి ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌దుపరి చ‌ర్య‌ల మీద ప‌క్కా ఆలోచ‌న‌ల‌తో ఉన్న‌ట్లుగా స్ప‌ష్టం అవుతోంది. కేబినెట్ ఏర్పాటు..తొలి విడత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన త‌రువాత జ‌గ‌న్ ఏపీలో గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి మీద దృష్టి పెడతార‌ని చెబుతున్నారు. అందులో భాగంగా..ముందుగా త‌మ ప్ర‌భుత్వం అవినీతి ర‌హిత పాల‌న విష‌యంలో ఎంత ప‌క‌డ్బందీగా అడుగులు వేస్తుందో ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చేలా కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. అందులో భాగంగానే జ్యూడిషియ‌ల్ క‌మీష‌న్ ఏర్పాటు. ఇక‌, రాజ‌ధాని భూ స్కాం మీద జ‌గ‌న్ సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయితే, ఆ విచార‌ణ రాజ‌ధాని నిర్మాణం మీద ప్ర‌భావం ప‌డ‌కుండా కేవ‌లం భూముల అమ్మ‌కాలు..తెర వెనుక వ్య‌క్తుల వ‌ర‌కే ప‌రిమితం చేస్తార‌ని చెబుతున్నారు.

పునాదులు క‌దులుతున్నాయి...

పునాదులు క‌దులుతున్నాయి...

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారినికి ముందే జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధానితో స‌మావేశ‌మ‌య్యారు. ఆ వెంట‌నే జ‌రిగిన మీడియా స‌మావేశంలో రాజ‌ధాని భూ కుంభ‌కోణం తీవ్ర‌మైన నేరంగా చెబుతూ..విచార‌ణ త‌ప్ప‌దే సంకేతాలు ఇచ్చారు.
ఇదే స‌మ‌యంలో అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంలో కీల‌క‌మైన హాయ్ ల్యాండ్ గురించి జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వేల కోట్లు విలువ చేసే హాయ్ ల్యాండ్ రెండు వంద‌ల కోట్ల‌కు మాత్ర‌మే విలువ చూపించారు. దీని వెనుక నాటి మంత్రి లోకేశ్ ప్ర‌మ‌యం ఉంద‌ని వైసీపీ అప్ప‌ట్లోనే ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో..ఇప్పుడు వేలాది మంది బాధితులు ఉన్న అగ్రిగోల్డ్ స్కాంలో కీల‌క‌మైన హాయ్‌లాండ్ పైన విచార‌ణ కోరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అధికార వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే, జ‌గ‌న్ వేయ‌బోయే అడుగులు ఏంటో ఈ నెల 10వ తేదీ త‌రువాత స్ప‌ష్టం కానుంది.

English summary
AP Govt given general consent for CBI to entry in AP. IN Chandra Babu tenure state govt cancel general consent to CBI. With these orders CM Jagan may key decision on corruption allegations in previous govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X