వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరిన్ని సడలింపులు - నగలు, బట్టలు, చెప్పుల షాపులకు ఓకే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ లో ప్రభుత్వం ఇవాళ మరిన్ని సడలింపులు ఇచ్చింది. వీటి ప్రకారం ఇకపై నగలు, చెప్పులు, బట్టల షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే వస్త్ర దుకాణాలు తెరిచినా వాటిలో కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ట్రయల్ రూమ్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కొత్త బట్టలైనా ఒకరు వేసుకున్న బట్టలు మరొకరు ట్రయల్ వేయడం ద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నందున ట్రయల్ రూమ్స్ కు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు.

ఇదే చివరి లాక్ డౌన్- ఇప్పటికే లక్ష్యం నెరవేరింది- కేంద్రం సంకేతాలు...ఇదే చివరి లాక్ డౌన్- ఇప్పటికే లక్ష్యం నెరవేరింది- కేంద్రం సంకేతాలు...

మరోవైపు పెద్ద పెద్ద షోరూమ్స్ తెరిచినా వాటికి వెళ్లాలంటే మాత్రం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ap govt gives more relaxations in lockdown

ప్రజలకు బయటి ఆహార పదార్ధాలను, తినుబండాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీధుల్లో తిరుగుతూ అమ్మే తినుబండారాలకు, బళ్లపై అమ్మే వాటికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పానీపూరీ బండ్లతో పాటు వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న టిఫిన్ బళ్లకు మాత్రం అనుమతి నిరాకరిస్తోంది. ఇప్పటికే హెయిర్ సెలూన్లతో పాటు పలు షాపులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం జూన్ 1 నాటికి మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

English summary
andhra pradesh govt on tuesday given more relaxations in lock down. as per the new rules govt to allow jewellery, clothes, footware shops and street food also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X