వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల సంఘ ఉత్త‌ర్వులు డోన్ట్ కేర్‌ : నిఘా బాస్ ను రిలీవ్ చేయకుండానే : జీవోల‌తో యుద్దం..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ ఏపిలో కొత్త వివాదం తెర మీద‌కు వ‌చ్చింది. ఎన్నిక‌ల సంఘం ముగ్గురు పోలీసు అధికారుల‌ను బ‌దిలీ చే స్తూ నిర్ణ‌యం వెలువ‌రించిన వెంట‌నే ప్ర‌భుత్వం వారిని రిలీవ్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. కానీ, తెల్లారే స‌రికి ఆలోచ న‌లు మారిపోయాయ‌. ఆ జీవో ను ర‌ద్దు చేస్తూ తాజాగా మ‌రో రెండు జీవోల‌ను విడుద‌ల చేసింది. అందులో ఇంట‌లి జెన్స్ డిజిని మాత్రం ప్ర‌భుత్వం రిలీవ్ చేయ‌కుండా ఇద్ద‌రు అధికారుల‌ను మాత్రం బ‌దిలీ చేసింది.

ఎన్నిక‌ల సంఘంతో ఏపి ప్ర‌భుత్వం ఢీ..

ఎన్నిక‌ల సంఘంతో ఏపి ప్ర‌భుత్వం ఢీ..

ఎన్నిక‌ల సంఘం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం పై ఏపి ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎన్నిక‌ల సం ఘం ఏపి ఇంట‌లిజెన్స్ చీఫ్ పై వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న తో పాటుగా మ‌రో రెండు జిల్లాల ఎస్పీని ఎ న్నిక‌ల విధుల నుండి త‌ప్పించాల‌ని ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్ర‌భుత్వం 26వ తేదీ రాత్రి ఇంట‌లిజెన్స్ డిజి తో పాటుగా క‌డ‌ప‌, శ్రీకాకుళం ఎస్పీల‌ను హెడ్ క్వార్ట‌ర్స్ కు బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, తెల్లారేస‌రి కి ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది. ఇంట‌లిజెన్స్ డిజి ఎన్నిక‌ల విధుల్లో ఉండ‌ర‌ని..వైసిపి ఫిర్యాదు ఆధారంగా ఇంట‌లిజెన్స్ చీఫ్ ను ఎలా బ‌దిలీ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. దీంతో, తాజాగా రెండు జీవోలు ఇచ్చారు. అందులో ఒక‌టి డిజిపి నుండి కానిస్టేబుల్ వ‌ర‌కు ఎన్నిక‌ల విధుల్లోకి తెస్తూ..ఇంట‌లిజెన్స్ అధికారుల‌ను మినహాయించారు. ఆ త‌రువా త మ‌రో జీవో ఇచ్చారు. అందులో రాత్రి ఇచ్చిన జీవో ర‌ద్దు చేసి తాజా జీవోలో ఇద్ద‌రు ఎస్పీల‌ను మాత్ర‌మే బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

వెన‌క్కు త‌గ్గ‌కూడ‌దని నిర్ణ‌యం..

వెన‌క్కు త‌గ్గ‌కూడ‌దని నిర్ణ‌యం..

వైసిపి ఫిర్యాదు మేర‌కు ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవ‌టాన్ని ముఖ్య‌మంత్రి మొద‌లు టిడిపి నేత‌లు త‌ప్పు బ‌డు తున్నారు. అస‌లు ఆ ఫిర్యాదు పై ఎటువంటి విచార‌ణ లేకుండా..నివేదిక‌లు కోర‌కుండా ఎలా బదిలీ చేస్తారంటూ ఎ న్నిక‌ల సంఘం నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. దీని పై ఎన్నిక‌ల సంఘానికి ముఖ్య‌మంత్రి సుదీర్ఘ లేఖ రాసారు. అదే స‌మ‌యంలో ఏపి హైకోర్టులో లంచ్ మోష‌న్ దాఖ‌లు చేసారు. కోర్టులో త‌మ వాద‌నల‌కు మ‌ద్ద‌తుగా ముందుగానే ఏపి ప్ర‌భుత్వం ఓ కీల‌క జీవో ఇచ్చింది. దీని మేర‌కు డిజ‌పి మోద‌లు కానిస్టేబుల్ వ‌ర‌కు ఎన్నిక‌ల విధుల్లో ఉన్నార‌ని ఆ జీవోలో పేర్కొంది. అయితే, ఆ జీవో లో మాత్రం నిఘా అధికారులు ఎన్నిక‌ల విధుల్లో లేర‌నే విష‌యం చెప్ప‌క‌నే చెప్ప టం ద్వారా ఏబి వెంక‌టేశ్వ‌ర రావు పై ఉత్త‌ర్వులు అమ‌లు కాకుండా ఈ ఎత్తుగ‌డ వేసింది.

ఆయ‌న పై టిడిపి..వైసిపి ప‌ట్టు..

ఆయ‌న పై టిడిపి..వైసిపి ప‌ట్టు..

ఏబి వెంక‌టేశ్వ‌ర రావు ను ఎలాగైనా బదిలీ చేయాల‌ని వైసిపి..ఆయ‌న‌ను ఎలా చేస్తార‌ని టిడిపి ఇలా రెండు పార్టీలు ఆయ‌న విష‌యంలో ప‌ట్టుద‌ల‌కు పోతున్నాయి. గ‌తంలో సిబిఐ ఏపిలో విచార‌ణ‌కు రాకుండా ఏపి ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘ నిర్ణ‌యాన్ని చాలెంజ్ చేస్తూ ఒక వైపు కోర్టులో పోరాటం చేస్తూనే..మ‌రో వైపు ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను భే ఖాత‌ర్ అంటున్నారు. తొలుత ఇసి ఉత్త‌ర్వులు మేర‌కు జీవీ జారీ చేసి..ఆ త‌రువాత దీనిని ర‌ద్దు చేసారు. ఇక‌, త‌మ ఇంట‌లిజెన్స్ చీఫ్ ఎన్నిక‌ల విధుల్లో లేర‌ని చెప్ప‌టం ద్వారా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ఉత్త‌ర్వుల‌కు అస‌లు విలువ లేద‌ని న్యాయ ప‌రంగా రుజువు చేయ‌ట‌మే ఏపి ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

English summary
AP Govt no implementing Election commission orders on action against IPS officers. AP govt issued go for Transfer of two SP's, but..not given for Intelligence chief. AP Govt approached Hi court against Election commission decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X