వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు షాక్: భారీగా మద్యం ధరలు పెంపు: బార్ల వేళలు కుదింపు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో మందుబాబులకు భారీ షాక్. మద్యం ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయివేటు మద్యం దుకాణాలను రద్దు చేసిన ప్రభుత్వం మద్యం అమ్మకాలకు నిర్ణీత వేళలను ప్రకటించింది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే సమయంలో బార్ల బార్ల సమయ వేళల్ని కుదించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు బార్లకు రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు చేస్తున్నారు. వీటి పైన అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీ మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో కొత్త మద్య విధానం నేటి నుండి అమల్లోకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా అమ్మకాలు సాగనున్నాయి.

ఆ మద్యం బంద్: ఇక అంతా ప్రభుత్వమే: బీర్లు మాత్రం కష్టమే..!

మద్యం ధరలు ఇలా పెరిగాయి..

మద్యం ధరలు ఇలా పెరిగాయి..

ఏపీలో మద్యం నిషేధంలో భాగంగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా.. దేశీయంగా తయారైన విదేశీ మద్యం 60, 90ml బాటిల్‌పై రూ.10 ట్యాక్స్, 180ml బాటిల్‌పై రూ.20, 375ml బాటిల్‌పై రూ.40 ట్యాక్స్ పెరిగింది. ఇక, 750 ml బాటిల్‌పై రూ.80, 1000 ml బాటిల్‌పై రూ.100 ట్యాక్స్ వేస్తూ నిర్ణయించింది. 2000 ml బాటిల్‌పై రూ.250 ట్యాక్స్ విదేశీ మద్యం 50ml, 60 ml బాటిల్‌పై రూ.10 ట్యాక్స్ అదే విధంగా విదేశీ మద్యం బ్రాండ్ల మీద ధరలను పెంచింది. విదేశీ మద్యం 200- 275ml బాటిల్స్‌పై రూ.20 ట్యాక్స్ విధించగా.. 330-500ml బాటిల్స్‌పై రూ.40, 700-750ml బాటిల్స్‌పై రూ.80 ట్యాక్స్ కొత్తగా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

1500-2000ml విదేశీ మద్యం బాటిల్స్‌పై రూ.250 ట్యాక్స్ 330ml, 500ml బీర్లపై రూ.10 ట్యాక్స్ అదనంగా ఛార్జ్ చేయనున్నారు. 650ml బీర్లపై రూ.20 ట్యాక్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 30వేల ఎఎంల్ 1000 ..50వేల ఎంఎల్‌ 2000 రెడీ టూ డ్రింక్ 250-275..20 ట్యాక్స్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉదయం 11 నుండి రాత్రి 8 వరకే అమ్మకాలు

ఉదయం 11 నుండి రాత్రి 8 వరకే అమ్మకాలు

మద్యం దుకాణాలు ఇక ఇప్పటికే ప్రభుత్వం పరిధిలోకి వెళ్లటంతో అమ్మకాల సమయాలను కుదించారు. అందులో భాగంగా నేటి నుండి ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి. తొలుత ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దుకాణాలు తెరవాలని నిర్ణయించారు. అయితే వాటిని సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న 4,380 మద్యం దుకాణాలను 20 శాతం మేర తగ్గించారు. ప్రభుత్వ పరిధిలో ఇక నుండి 3,500 దుకాణాలు మాత్రమే నడవనున్నాయి. పర్మిట్ రూమ్ లను రద్దు చేసారు. జూన్ నుండి ఇప్పటి వరకు 15 శాతం మద్యం అమ్మకాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.

బార్ల వేళల్లోనూ కుదింపు..

బార్ల వేళల్లోనూ కుదింపు..

మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తుల నుండి తప్పించి తమ అధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం దుకాణాల అమ్మకాల వేళలను కుదించిన ప్రభుత్వం, ఇక బార్ల విషయంలోనూ కీలక చర్చలు చేస్తోంది. అందులో భాగంగా బార్ల వేళల్లోనూ మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో 880 బార్లున్నాయి. మద్యం షాపుల వేళల మాదిరిగానే బార్ల సమయ వేళల్ని కుదించనున్నారు. ప్రస్తుతం బార్లలో ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఫుడ్‌ సర్వింగ్‌ పేరిట అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. వీటిపైనా నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

English summary
Ap Govt imposed heavy taxes on liquor sales in large scale. To day onwards new liquor policy implementing with changes. Govt also decided to limit bars timings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X