వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు: అసెంబ్లీ పూర్తిగా అమరావతిలోనే:శాసనసభలో బిల్లుల ప్రతిపాదన..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly : AP Finance Minister Buggana Rajendranath Reddy Brief Explanation On Three Capitals !

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే అజెండా ప్రకారం..ఇప్పటికే కేబినెట్ లో ఆమోదించిన అధికార వికేంద్రీకరణ బిల్లును సభలో ఆర్దిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. అదే విధంగా సీఆర్డీఏ రీపీల్ యాక్ట్ 2020 బిల్లును మున్సిపల్ శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రతిపాదించారు. దీని పైన చర్చకు ప్రారంభం ముందుగా మంత్రి బుగ్గన ఈ బిల్లుల ప్రతిపాదన ఉద్దేశాలను సభకు వివరించారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా పూర్తి స్థాయిలో రాష్ట్రం అన్ని రకాలుగా డెవలప్ చేసేందుకు ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు: రెండు కీలక బిల్లులు..టీడీపీ అభ్యంతరం: బీఏసీలో నిర్ణయం...!మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు: రెండు కీలక బిల్లులు..టీడీపీ అభ్యంతరం: బీఏసీలో నిర్ణయం...!

అందులో భాగంగా మూడు రాజధానులు..మొత్తం 13 జిల్లాలను నాలుగు జోనల్ బోర్డులుగా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసారు. దీంతో పాటుగా.. అమరావతి మెట్రో పాలిటిన్ రీజయన్ ఏర్పాటు చేస్తున్నామని..అక్కడి నుండే లెజిస్లేటివ్ రాజధానిగా ప్రతిపాది స్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు. విశాఖ మెట్రో పాలిటిన్ రీజయన్ లో పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించారు.కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్నట్లు బిల్లులో స్పష్టత ఇచ్చారు.

 మూడు రాజధానుల ప్రతిపాదన...

మూడు రాజధానుల ప్రతిపాదన...

ఏపీ ప్రభుత్వం ముందు నుండి చెబుతున్న విధంగానే..మూడు రాజధానుల ప్రతిపాదనను బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. ఆర్దిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశ పెట్టిన ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్‌ ఆఫ్ ఆల్ రిజీయన్స్‌ బిల్‌-2020 లో అనేక అంశాలను ప్రస్తావించారు. మొత్తం 13 జిల్లాలను నాలుగు రీజియన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లుగా స్పష్టం చేసారు. వీటి కోసం పాలనా మండళ్లను ఏర్పాటు చేస్తున్నామని..వాటికి పాలక మండళ్లు ఉంటాయని బుగ్గన వివరించారు. అదే సమయంలో తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు పాలన వికేంద్రీకరించే విధంగా నిర్ణయించామని మంత్రి చెప్పుకొచ్చారు. విశాఖలో పరిపాలనా రాజధాని..అమరావతిలో శాసన రాజధాని..కర్నూలు లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు విస్పష్టంగా ప్రతిపాదించారు. ఇందు కోసం ఈ మూడు నగరాలను మెట్రో పాలిటిన్ రీజియన్లుగా డెవలప్ చేస్తున్నట్లు బిల్లులో వివరించారు. దీనిని మంత్రి బుగ్గన సభకు వవిరించారు.

అసెంబ్లీ పూర్తిగా అమరావతిలోనే..

అసెంబ్లీ పూర్తిగా అమరావతిలోనే..

ఇక, ఇదే సమయంలో మంత్రి ప్రతిపాదించిన బిల్లులో మూడు రాజధాను అంశాన్ని ప్రస్తావించారు. అందులో భాగంగా విశాఖ మెట్రో రీజినల్ డెవలప్ మెంట్ అధారిటీ పరిధిలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలోనే ముఖ్యమంత్రి కార్యాలయం..సచివాలయం ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేసారు. ఇక, హైకోర్టు..సుప్రీం కోర్టు అనుమతి తీసుకొని కర్నూలు రీజనల్ డెవలప్ మెంట్ అధారిటీ కింద కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి..న్యాయ రాజధానిగా తీర్చి దిద్దుతామని చెప్పుకొచ్చారు. ఇక, అమరావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జీఎన్ రావు.. బోస్టన్ కమిటీ సిఫార్సులకు భిన్నంగా.. హైపవర్ కమిటీ సూచనల మేరకు అమరావతిలో సీజన్ వారీగా కాకుండా..పూర్తిగా శాసనసభా కార్యకలాపాలను అమరావతిలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇందు కోసం అమరావతి మెట్రో పాలిటిన్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ కింద ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి..అమరావతి ప్రాంతాన్ని జ్యుడిషియల్ రాజధానిగా ప్రతిపాదించారు.

సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు..

సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు..

ఏపీలో నాలుగు రీజియన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం..అందు కోసం 13 జిల్లాలను ఆ రీజియన్ బోర్డుల కిందకు తీసుకొచ్చింది. ఇక, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి లో రాజధాని కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం సభలో చర్చ..ఆమోదం కోసం బిల్లును మంత్రి బొత్సా ప్రతిపాదించారు. దీని ద్వారా గతంలో ఈ చట్టం కింద చేసుకున్న అన్ని నిర్ణయాలు రద్దు కానున్నాయి. అదే సమయంలో రైతుల మీద ప్రభావం పడకుండా మాత్రం వారికి అందిస్తున్న కౌలును రెట్టింపు చేయటంతో పాటుగా.. నిజమైన భూ యజమానులకు ప్రస్తుతం ప్రభుత్వం హామీ ఇచ్చిన డెవలప్డ్ రిటర్నబుల్ ప్లాట్ల ను మరో రెండు వందల గజాలు పెంచి ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇక, సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ ఏరియా గా ఫ్రకటించి..అక్కడ ఏ రకంగా డెవలప్ చేసేది చర్చకు సమాధానంలో భాగంగా ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. దీంతో..ప్రభుత్వ ప్రతిపాదనలు బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకొచ్చాయి. ఇక, ఇప్పుడు చర్చ సమయంలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.

English summary
Ap Govt introduced three capitals bill in Assembly by name decentralisation. Anothet bill CRDA repeal act also presented in house. After discussions these bills may be passed in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X