వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసారి మండలి లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పక్కా ప్లాన్‌తో వైసీపీ ప్రభుత్వం!

|
Google Oneindia TeluguNews

కేంద్రం వద్ద ఏపీ శాసనమండలి ప్రతిపాదన పెండింగ్ లో ఉందన్న సాకుతో ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరచారని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మండలి రద్దుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకూ మండలి సమావేశపరచాల్సిందే. కానీ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 ఈసారి ఏపీ అసెంబ్లీ భేటీ మండలి లేకుండానే !

ఈసారి ఏపీ అసెంబ్లీ భేటీ మండలి లేకుండానే !

కేంద్రం వద్ద ఏపీ శాసనమండలి ప్రతిపాదన పెండింగ్ లో ఉందన్న సాకుతో ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరచారని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మండలి రద్దుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకూ మండలి సమావేశపరచాల్సిందే. కానీ సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 ఏపీ మండలి రద్దును కేంద్రం ఆమోదిస్తుందా

ఏపీ మండలి రద్దును కేంద్రం ఆమోదిస్తుందా

ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం ద్వారా అడ్డుకున్న శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు ఈ తీర్మానాన్ని కేంద్రం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో బిల్లు రూపంలో తీసుకొస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్ రెండు విడతల సమావేశాల మధ్య గ్యాప్ లో సీఎం జగన్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అదే సమయంలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నూ కలుసుకున్నారు. ఈ భేటీల్లో ఏపీ శాసనమండలి రద్దే ప్రధాన అజెండా అయింది. జగన్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ తర్వాత వైసీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఏపీ శాసనమంండలి రద్దు బిల్లు పెట్టి ఉభయ సభల్లోనూ ఆమోదించాల్సి ఉంది. అదే జరిగితే జగన్ కు లైన్ క్లియర్ అయినట్లే. బీజేపీ పెద్దల నుంచి అందిన హామీ మేరకే పార్లమెంటులో మండలి రద్దు బిల్లు పెట్టే వరకూ ఆగి ఆ తర్వాత అసెంబ్లీపై నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా వైసీపీ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది.

 మండలి రద్దు బిల్లు కేంద్రం ఆమోదించకుంటే

మండలి రద్దు బిల్లు కేంద్రం ఆమోదించకుంటే

ఏపీ శాసనమండలి రద్దుపై ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం మేరకు కేంద్రం ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే బిల్లు పెట్టకపోతే ఏంటన్న చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలే విపక్షాలు ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి. ఇదే పరిస్దితి కొనసాగితే ఏపీ మండలి రద్దు వంటి కీలక బిల్లులను ఆమోదించే పరిస్ధితి ఉండదు. అప్పుడు ఏపీ ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అప్పుడు మండలి రద్దు ప్రతిపాదన కేంద్రం ముందున్న కారణంగా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

జగన్ అసెంబ్లీని మాత్రమే సమావేశపరిచితే టీడీపీ వ్యూహమేంటి

జగన్ అసెంబ్లీని మాత్రమే సమావేశపరిచితే టీడీపీ వ్యూహమేంటి

ఏపీ శాసనమండలి ప్రతిపాదన కేంద్రం ముందు ఉందన్న సాకుతో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరిచే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో టీడీపీ కూడా అప్రమత్తమైంది. రాజధాని బిల్లుల ప్రతిపాదన చేస్తే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్న టీడీపీ... మండలి భేటీ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చూస్తే కోర్టును ఆశ్రయించి తీరుతామని చెబుతోంది.

Recommended Video

Mukesh Ambani Meets AP CM, Discusses Industrial Devlopment | Oneindia Telugu
 ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలే

ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలే

ఓవైపు రాజధాని తరలింపు ప్రక్రియ వెంటనే చేపట్టాల్సిన పరిస్దితి. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఇంకోవైపు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ. ఇలా మూడు ముక్కలాట తప్పని పరిస్దితుల్లో ప్రభుత్వం పూర్తిస్ధాయిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేని పరిస్దితి నెలకొంది. దీంతో ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు పెట్టుకుని, మూడు నెలల్లోపు తిరిగి పూర్తిస్ధాయి బడ్జెట్ పెట్టాలనేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది.


అసెంబ్లీ సమావేశాలు ఓటాన్ అకౌంట్ రూపంలో ఉంటాయా పూర్తి స్దాయిలో జరుగుతాయా పక్కనబడితే కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరిస్తే మాత్రం న్యాయపోరాటం చేసేందుకు టీడీపీ సిద్దమవుతోంది.

English summary
Ruling YSRCP Govt is mulling over Assemly Budget Sessions and Plans to Organise Legislative Assembly sessions and not Legislative Council in view of the Pending Proposal over Abolition of the Same at Centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X