వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జ‌గ‌న్ సీట్లో ఉంటే..మంత్రులు ఎవ‌రు ఎక్క‌డ ఉండాలంటే: ముఖ్య‌మంత్రి త‌రువాతి స్థానం ఆయ‌న‌కే..!

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్య‌మంత్రికి ఎవ‌రు ఎటు ఉండాలో నిర్ణ‌యిస్తూ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. అందుకు సంబంధించి మ్యాప్ వేసి మ‌రీ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ముఖ్య‌మంత్రి ..అయిదుగురు ఉప ముఖ్య‌మంత్రులు..సీనియ‌ర్లు ఉండ‌టంతో ఎక్క‌డా ప్రోట‌కాల్..ఇగో స‌మ‌స్య‌లు రాకుండా ముందుగా ప్ర‌భుత్వ‌మే ఎవ‌రు ఎక్క‌డ ఉండాలి..ఎవ‌ర‌కు ప‌క్క‌న ఎవ‌రు ఉండాలి..ఎవ‌రికి తొలి స్థానం ద‌క్కుతుంద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టంగా వివ‌రించారు. ఈ ఆస‌క్తి క‌ర‌మైన ఉత్త‌ర్వులు మ‌రింతగా అధ్య‌య‌నం చేస్తే..ఇలా..

ఏపీ ప్ర‌భుత్వం ఆస‌క్తిక‌ర ఉత్త‌ర్వులు..

ఏపీ ప్ర‌భుత్వం ఆస‌క్తిక‌ర ఉత్త‌ర్వులు..

ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఆస‌క్తి క‌ర‌మైన ఉత్త‌ర్వులు జారీ చేసింది. అందులో డ‌యాగ్రంతో స‌హా ఇచ్చిన ఉత్త‌ర్వులు ఇప్పుడు మంత్రుల పేషీల్లో..అధికారుల వ‌ద్ద ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన తరువాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ 40 రోజుల కాలంలో ఒక్క సారే మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. దాదాపు అయిదు గంట‌ల పాటు సాగిన ఆ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఆ త‌రువాత మ‌ర‌లా ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రివ‌ర్గ సమావేశం పైన నిర్ణ‌యం జ‌ర‌గ‌లేదు. ఇదే స‌మ‌యంలో మంత్రి వ‌ర్గ ఉప సంఘాల‌తో స‌మావేశాలు.. మంత్రుల‌తో స‌మీక్ష‌లు..అధికారుల‌తో రివ్యూలు ముఖ్య‌మంత్రి నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో కొత్త ప్ర‌భుత్వం కావ‌టంతో ఎక్క‌డా ఎవ‌రికి ప్రాధాన్య‌త త‌గ్గ‌కుండా..ఎవ‌రి మ‌న‌సు నొచ్చుకోకుండా ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందులో భాగంగానే ఈ ఉత్త‌ర్వ‌లు జారీ చేసిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.ఇందులో సీఎం జ‌గ‌న్‌కు ఏ మంత్రి ఎటువైపు ఉండాలి..ఎవ‌రికి ఎక్క‌డ సీటింగ్ అనేది ఖారారు చేసారు

మ‌ద్య‌లో జ‌గ‌న్ అటు 13..ఇటు 12 మంది..

మ‌ద్య‌లో జ‌గ‌న్ అటు 13..ఇటు 12 మంది..

ముఖ్య‌మంత్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగే మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఏమంత్రి ఎక్క‌డ ఆసీనులు కావాల‌నే స్థానాల‌ను వివ‌రిస్తూ ప్ర‌భుత్వ ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేబినెట్ స‌మావేశ మందిరంలో రౌండ్‌గా ఉండే టేబుట్‌కు అంద‌రికీ మ‌ధ్య‌లో ..ఎదురుగా ముఖ్య‌మంత్రి సీటు ఉంటుంది. ఆయ‌న‌కు కుడి వైపున 13 మంది..ఎడ‌మ వైపున 12 మంది మంత్రుల‌కు సీటింగ్ ఖ‌రారు చేసారు. ముఖ్య‌మంత్రికి అటూ ఇటూ ఉప ముఖ్య‌మంత్రుల హోదాలో పిల్లి సుభా్‌షచంద్రబోస్‌, నారాయణస్వామిలు కూర్చుంటారు. ఆ తర్వాత సీఎంకు కుడివైపున వరుసలో బోస్‌ తర్వాత పాముల పుష్పశ్రీవాణి, షేక్‌ అంజద్‌ బాష, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కొడాలి నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేశ్‌, తానేటి వనిత, వెలంపల్లి శ్రీనివాస్‌, గుమ్మనూరు జయరామ్‌, ఎం. శంకర నారాయణ ఉంటారు. ఇక సీఎంకు ఎడమ వైపున వరుసలో నారాయణస్వామి తర్వాత ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్‌, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన కృష్ణదాస్‌, మేకతోటి సుచరిత, అనిల్‌ కుమార్‌, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్‌, మేకపాటి గౌతంరెడ్డి, చెరకువాడ శ్రీరంగనాథరాజుకు సీటింగ్ ఖ‌రారు చేసారు.

బీసీ..ఎస్సీ డిప్యూటీ సీఎంల‌కు ప్రాధాన్య‌త‌..

బీసీ..ఎస్సీ డిప్యూటీ సీఎంల‌కు ప్రాధాన్య‌త‌..

కేబినెట్ కూర్పులో సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చిన జ‌గ‌న్‌..ఇప్పుడు సీటింగ్‌లోనూ అదే ఫార్ములా అనుస రించిన‌ట్లు క‌నిపిస్తోంది. అదే విధంగా కేబినెట్‌లో సీనియ‌ర్ అయిన బీసీ వ‌ర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్.. ఎస్సీ వ‌ర్గానికి చెందిన నారాయ‌ణ స్వామి సీఎంకు కుడి..ఎడ‌మ వైపు తొలి స్థానంలో సీటింగ్ ఇచ్చారు. ఇక‌, కేబినెట్ స‌మావేశాల్లో కీల‌క పాత్ర పోషించే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి సీఎంకు ప‌క్క‌నే సీటింగ్ ఉంటుంది. ఈ ఉత్త‌ర్వుల్లో టేబుల్ ఆకారం వేసి..సీఎంతో పాటుగా మంత్రుల స్థానాల‌ను నెంబ‌ర్లు వేసి మ‌రీ వివ‌రంగా ఉత్త‌ర్వులు జారీ చేయేటం ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. వ‌చ్చే కేబినెట్ స‌మావేశాల నుండి ఈ సీటింగ్ విధానం అమ‌లు కావాల‌ని ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వుల్లో స్ప‌ష్ట చేసింది.

English summary
AP Govt issued interesting GO on Cm and Ministers seating arrangement at the time of cabinet meeting with diagram in GO. In total of 25 ministers 12 members right of CM and other 13 members left of Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X