• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ ఆవేదనకు సీఎం జగన్ పరిష్కారం : చంద్రబాబు చేయలేనిది..నేడు ఇలా..!!

|
  ఉద్దానం సమస్యకు పరిష్కారం దిశగా జగన్ అడుగులు || AP Govt Issued Orders For 600cr To Uddanam Area

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదనకు..అభ్యర్ధను ముఖ్యమంత్రి జగన్ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు సహకరించిన పవన్ కళ్యాణ్ ఏ సమస్య చంద్రబాబు హాయంలో లేవనెత్తిన వెంటనే దాని పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నట్లుగా ప్రచారం చేసేవారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ నాడు టీడీపీ ప్రభుత్వానికి మిత్రడుగా ఉంటూనే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల పక్షాన నిలబడ్డారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అప్పట్లోనే సచివాలయానికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ, అప్పుడు ప్రభుత్వం నుండి సమస్య శాశ్వత పరిష్కార దిశగా చర్యలు లేవు. కొన్ని చర్యలు తీసుకున్నా అవి అంతగా బాధితులకు ఆసరా ఇవ్వలేదు. ఇక, ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నాడు వ్యక్తం చేసిన ఆవేదన .. అభ్యర్ధలకు పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించారు.

  ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన పవన్..

  ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన పవన్..

  2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం సహకరించిన పవన్ కళ్యాణ్ నాడు ప్రభుత్వానికి ఒక అభ్యర్ధన చేసారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల పక్షాన పవన్ నిలబడ్డారు. వారికి మద్దతుగా ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యను అవగాహన చేసుకున్నారు. వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తో ఇదే అంశం పైన చర్చలు జరిపారు. నేరుగా అమరావతి లోని సచివాలయంలో చంద్రబాబు తో సమావేశమయ్యారు. దీంతో..నాటి ఆరోగ్య శాఖా మంత్రి కామినేనితో కలిసి కిడ్నీ సమస్య నిపుణులతో అక్కడి పరిస్థితి మీద అధ్యయనానికి నిర్ణయం తీసుకున్నారు. పవన్ ప్రస్తావించిన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని నాటి సీఎం హామీ ఇచ్చారు. అందులో భాగంగా తరువాతి రోజుల్లో కొన్ని చర్యలు తీసుకున్నారు. అక్కడ నీటి ప్రభావం కారణంగా అనేక మంది కిడ్నీ బాధితులుగా మారారని గుర్తించారు. ఫలితంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పధకం కింద ఏడు మండలాలకు మంచి నీటి సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు. మూడు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు రూ 3500 పెన్షన్ అందించాలని నిర్ణయించారు. అయితే శాశ్వత ప్రాతిపదికన చర్యలు మాత్రం తీసుకోలేదు.

   కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం

  కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం

  ఇక, ఏపీలో ప్రభుత్వం మారి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉద్దానం సమస్య పరిష్కారానికి చర్యలు మోదలు పెట్టారు. అందులో భాగంగా..ఆ ప్రాంతంలో రూ.600 కోట్లతో సమగ్ర మంచి నీటి పథకం నిర్మాణానికి అనుమతి తెలిపింది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి, రోగులు ఎక్కువగా ఉండడానికి అక్కడి ప్రజలు తాగే నీరు కారణమని పలువురు నిపుణులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని బోర్ల ద్వారా సేకరించిన నీటినే మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇకపై బయటి ప్రాంతం నుంచి నదీ జలాలను ఆ ప్రాంతానికి తరలించి ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని రేగులపాడు వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలోని పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 807 నివాసిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఉపయోగం కలగనుందని అధికారులు చెబుతున్నారు. ఈ సమగ్ర మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేయనున్నారు.

  పవన్ ఆవేదనకు పరిష్కారం దిశగా..

  పవన్ ఆవేదనకు పరిష్కారం దిశగా..

  ఎన్నో రోజులుగా పవన్ కళ్యాణ్ ఉద్దానం బాధితుల పక్షాన వారి వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఉద్దానం బాధితులను వ్యాధి స్థాయిని బట్టి కాకుండా బాధితులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ పది వేలు పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు దిశగా స్థల పరిశీలన చేసారు. ఇక, ఇప్పుడు 600 కోట్లతో సమగ్ర మంచి నీటి పధకానికి నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వలన మొత్తంగా బాధితులు ఉన్న ఏడు మండలాలకు కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు,పలాస-కాశీబుగ్గ, మందస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రయోజనం కలగనుంది. పవన్ కళ్యాణ్ చెప్పారని కాదని..తమకు అక్కడ ప్రజల మీద ఉన్న బాధ్యతతోనే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి..తొలి నుండి జగన్ ను రాజకీయంగా వ్యతిరికించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయాల మీద ఎలా స్పందిస్తారో చూడాలి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP govt issued orders for 600cr value of drinking water projects of kideny effected area Uddanam. previously Pawan Kalyan stand for kideny patients and demanded govt to take steps for save them. Now Jagan govt taken serious steps to protect thier people.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more