వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన ఏపి ప్ర‌భుత్వం : ఇంట‌లిజెన్స్ డిజి బ‌దిలీ: ఉత్త‌ర్వులు జారీ..!

|
Google Oneindia TeluguNews

ఏపి ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు దిగొచ్చింది. కోర్టు త‌మ పిటీష‌న్ తిర‌స్క‌రించ‌టం తో ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వేంక‌టేశ్వ‌ర రావును బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నిక‌ల సంఘం ఇంట‌లిజెన్స్ చీఫ్ పై వేటు వేసిన త‌రు వాత రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ నిర్ణ‌యం అమ‌లు చేయ‌లేదు. దీని పై కోర్టుకు వెళ్లింది. అక్క‌డ కోర్టు సైతం ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేయ‌టంతో.. ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇంట‌లిజెన్స్ చీఫ్ బ‌దిలీ..

ఇంట‌లిజెన్స్ చీఫ్ బ‌దిలీ..

ఏపి ప్ర‌భుత్వం లో ఇంట‌లిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబి వెంక‌టేశ్వ‌ర రావు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార ని ప్ర‌తిప‌క్ష వైసిపి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారుల‌ను అధికార పార్టీకి మ‌ద్ద‌తుగా వినియోగి స్తున్నార‌ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తెచ్చారు. ఆయ‌నను ఎన్నిక‌ల విధుల నుండి దూరంగా ఉంచాల‌ని ఎన్నిక‌ల సంఘానికి వైసిపి విజ్ఞ‌ప్తి చేసింది. ఇంట‌లిజెన్స్ చీఫ్ తో పాటుగా డిజిపి అదే విధంగా ప‌లు జిల్లాల ఎస్పీలు.. సీనియ‌ర్ అధికారుల వ్య‌వ‌హార శైలి పై ఆధార‌ల‌ను ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించింది. దీని పై ఎన్నిక‌ల సంఘం స్పందించిం ది. అందులో భాగంగా ఇంట‌లిజెన్స్ డిజి తో పాటుగా శ్రీకాకుళం, క‌డ‌ప ఎస్పీల పై బ‌దిలీ వేటు వేసింది. అయితే, ఏపి ప్ర‌భుత్వం మాత్రం ఇంట‌లిజెన్స్ చీఫ్ కు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తో సంబంధం లేదంటూ ఆయ‌న్ను రిలీవ్ చేయ‌టానికి నిరాక‌రించింది. దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్ర‌యించింది.

హైకోర్టుకు ఏపి ప్ర‌భుత్వం..

హైకోర్టుకు ఏపి ప్ర‌భుత్వం..

ఇద్ద‌రు ఎస్పీల‌ను బ‌దిలీ చేసిన ఏపి ప్ర‌భుత్వం ఇంట‌లిజెన్స్ విష‌యంలో మాత్రం ప‌ట్టుద‌ల కు పోయింది. వైసిపి ఫిర్యాదు చేస్తే ఎన్నిక‌ల సంఘం ఎలా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని టిడిపి నేత‌లు ప్ర‌శ్నించారు. అస‌లు ఎన్నిక‌ల ప్ర‌క్రి య తో ఇంట‌లిజెన్స్ చీఫ్ కు ఎలాంటి బాధ్య‌త‌లు ఉండ‌వ‌ని..అటువంటి అధికారి పై చ‌ర్య‌లు ఎలా తీసుకుంటార‌ని కోర్టులో ఏపి ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. అయితే, ఎన్నిక‌ల సంఘం న్యాయ‌వాది మాత్రం ఇంట‌లిజెన్స్ సైతం పోలీసు శాఖ లో భాగంగానే ఉంటుంద‌ని..ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయాల్సిందే అని ఇసి న్యాయ‌వాది కోర్టుకు నివేదించారు. దీంతో..హైకోర్టు ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని ఆదేశి స్తూ..ఏపి ప్ర‌భుత్వ పిటీష‌న్ ను తిరస్క‌రించింది.

ఎట్ట‌కేల‌కు వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌దిలీ..

ఎట్ట‌కేల‌కు వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌దిలీ..

హైకోర్టు త‌మ పిటీష‌న్ ను తిరస్క‌రించ‌టంతో..ఏపి ప్ర‌భుత్వం తొలుత సుప్రీం కు వెళ్లే ప్ర‌తిపాద‌న పై చ‌ర్చ చేసింది. అయితే, ఒక అధికారి కోసం సుప్రీం దాకా వెళ్ల‌టం వ‌ల‌న ప్ర‌భుత్వం పై ప్ర‌తికూల సంకేతాలు వ‌స్తాయ‌ని అంచనాకు వ‌చ్చారు. దీంతో..ఎట్ట‌కేల‌కు ఇంట‌లిజెన్స్ చీఫ్ వెంక‌టేశ్వ‌ర రావును బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిం ది. అందులో వెంక‌టేశ్వ‌ర రావును హెడ్ క్వార్ట‌ర్స్ కు ఎటాచ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఎన్నిక‌ల విధులు అప్ప‌గించ వ‌ద్ద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసారు. దీంతో..ఎన్నిక‌ల సంఘం వ‌ర్సెస్ ఏపి ప్ర‌భుత్వం గా మారిన ఏబి వెంక‌టేశ్వ‌ర రావు వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు ముగిసింది.

English summary
AP govt at last relieved Intelligence chief AB Venkateswara rao. Govt attached him to Police head quarters. and also directed that should not allow him for elections duty as per election commission orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X