వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..

|
Google Oneindia TeluguNews

120 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వే నిర్వహించే భారీ ప్రక్రియకు సంబంధించి జగన్ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తన పాదయాత్ర సమయంలో భూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత .. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన చట్టం రూపొందించి, బడ్జెట్ లో నిధులు సైతం కేటాయించారు. వచ్చేఏడాది జనవరి 1 నుంచి మొదలుపెట్టాలనుకున్న సర్వేను పది రోజులు ముందుగానే.. అంటే ఈనెల 21 నుంచే ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

నిమ్మగడ్డకు జగన్ మరో షాక్ -స్థానిక ఎన్నికలపై హైకోర్టులో సర్కారు పిటిషన్ -సుప్రీం తీర్పుతో ఆటలా?నిమ్మగడ్డకు జగన్ మరో షాక్ -స్థానిక ఎన్నికలపై హైకోర్టులో సర్కారు పిటిషన్ -సుప్రీం తీర్పుతో ఆటలా?

 సీఎం చేతుల మీదుగా..

సీఎం చేతుల మీదుగా..

ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 21న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. భూముల రీసర్వే పథకాన్ని డిసెంబరు 21న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయితే, జగన్ ఏ ఊళ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారనేది వెల్లడికావాల్సి ఉంది. భూముల రీసర్వే కార్యక్రమానికి.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంగా ఇటీవల పేరు మార్చడం తెలిసిందే. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే సక్సెస్ కావడంతో అదే నమూనాలో రాష్ట్రమంతటా రీసర్వే చేయనున్నారు.

 దేశంలో తొలిసారి..

దేశంలో తొలిసారి..

అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్​లు, కార్స్ టెక్నాలజీ, రోవర్లను వినియోగిస్తూ భూముల రీసర్వే చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. ఈ ప్రక్రియ కోసం ఖర్చు భారీగానే ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం.. తొలి విడతగా గత వారమే రూ. 987.46 కోట్లమేర పరిపాలన అనుమతులు జారీ చేసింది. భూముల రీసర్వేలో ఉపయోగించే డ్రోన్ల కోసం రూ.81 కోట్లు, కార్స్ నెట్ వర్క్ జిఎన్ఎస్ రోవర్లకు రూ.100 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. సరిహద్దు రాళ్ల కోసం మరో రూ.600.62 కోట్లు అవుతుందని అంచనా. వ్యవసాయ భూములతోపాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర భూములనూ రీసర్వే చేయనున్నారు. ఇందుకోసం..

రీసర్వే ఎలా చేస్తారంటే..

రీసర్వే ఎలా చేస్తారంటే..

ఏపీలో మొత్తం 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూముల రీసర్వే కొనసానుంది. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ, ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు సర్వే పని చేస్తాయి. జీపీఎస్ ద్వారా ఫొటోలు తీసి, వాటిని ప్రాసెస్‌ చేస్తూ, క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించి, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ చేపడతారు. డ్రోన్ల ద్వారా స్పష్టంగా కనిపించేలా గ్రామ కంఠాలను జీఐఎస్‌ ద్వారా ఫోటో తీసి భద్రపరుస్తారు. భూ రికార్డుల్ని ట్యాంపర్‌ చేయడానికి వీలు లేకుండా సమగ్ర భూసర్వే ద్వారా వివరాలను పక్కాగా డిజిటలైజేషన్ చేయనున్నారు. దీనికి సమాంతరంగా..

ఎక్కడికక్కడే పరిష్కారాలు..

ఎక్కడికక్కడే పరిష్కారాలు..

2020 డిసెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వేను 2023 జనవరిలోగా పూర్తి చేసేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం మూడు దశల్లో భూముల రీసర్వే చేపట్టనుండగా. ఇందుకోసం నిరంతరాయంగా పనిచేసే పనిచేసే 70 బేస్ స్టేషన్లు (కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్) ఏర్పాటు చేశారు. అటు సర్వే చేస్తూనే.. ఇటు భూ వివాదాలు ఎక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా మొబైల్‌ (విలేజ్‌) కోర్టులు కూడా సిద్ధం చేశారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ సమన్వయంతో నిర్వహించనున్న ఈ రీసర్వేలో వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలతోపాటు పట్టణ సచివాలయాల్లోని ఇతర సెక్రటరీలు కూడా కీలకపాత్ర పోషిస్తారు. ప్రతి ఆస్తికీ ఒక యూనిక్‌ కోడ్‌ నెంబర్‌ను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ నమో దు చేస్తూ రెవెన్యూ రికార్డులను సవరిస్తారు.

నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్‌లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్‌లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?

English summary
Andhra Pradesh government on tuesday issued orders for land reserve across the state. CM Jagan will inaugurate the land reserve scheme on December 21. ysr-jagananna permanent land rights and land protection scheme will start from december 21st, state Revenue Department said in go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X