అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఉద్యోగుల‌కు గ‌డ్ న్యూస్ : మ‌ధ్యంత‌ర భృతి జీవో వ‌చ్చేసింది: ఈ నెల నుండే వ‌ర్తింపు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా చూస్తున్న ఎదురు చూపులు ఫ‌లించాయి. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు.. పెన్ష నర్ల‌కు మ‌ధ్యంత‌ర భృతి అమ‌లు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆ త‌రువాత అధికారంలోకి రాగానే స‌చివాల‌యానికి వ‌చ్చిన తొలి రోజునే ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఉద్యోగుల‌కు మ‌రి కొన్ని హామీల‌ను ఇచ్చారు. ఇక‌, జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు ఈ నెల 1వ తేదీ నుండి 27 శాతం మ‌ధ్యంతర భృతి అమల య్యేలా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Recommended Video

సొంత ఇల్లు కోసం బాబు పాకులాడుతున్నాడు. -విజయసాయి రెడ్డి

మ‌ధ్యంత‌ర భృతి ఉత్త‌ర్వులు జారీ..
ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు..పెన్ష‌న‌ర్ల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి అమ‌లు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఎన్నిక‌ల ముందు నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉద్యోగుల‌కు 20 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే, నాటి విప‌క్ష నేత జ‌గ‌న్ తాను అధికారంలోకి వ‌స్తే ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతితో పాటుగా త్వ‌రిత గ‌తిన పీఆర్సీ అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. తాజా ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గ‌త నెల 8వ తేదీన తొలి సారిగా స‌చివాల‌యానికి వ‌చ్చారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఉద్యోగుల‌తో జ‌రిపిన ఆత్మీయ స‌మావేశంలో తాను ఇచ్చిన హామీ మేరకు మ‌ద్యంత‌ర భృతి పైన తొలి కేబినెట్ స‌మావేశంలోనే నిర్ణ‌యం తీసుకుంటా మ‌ని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా గ‌త నెల 10వ తేదీన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన తొలి కేబినెట్ స‌మావేశంలో ఇత‌ర అంశాల‌తో ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఇవ్వ‌టానికి ఆమోద ముద్ర వేసారు. ఈ నెల 1వ తేదీ నుండి అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

AP Govt issued orders to implement 27 percent Interim Relief for State govt employees from 1st of this month.

త్వ‌ర‌లోనే పీఆర్సీ సిఫార్సుల పైన నిర్ణ‌యం..
రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం నియ‌మించిన వేత‌న సంఘం సిఫార్సుల మీద త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం తీసు కుంటామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క‌పోయినా ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు 27 శాతం మ‌ధ్యంత‌ర భృతి ఉత్త‌ర్వులు జారీ చేసామ‌ని వివ‌రిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్ర‌తీ ప్ర‌భుత్వ ఉద్యోగికి ఇంటి స్థ‌లం ఖ‌చ్చితంగా కేటాయిస్తామ‌ని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. సీపీసీ విధానం ర‌ద్దు మీద క‌మిటీ ఏర్పాటు...ప్ర‌భుత్వంలో ఆర్టీసి విలీనం వంటి నిర్ణ‌యాల మీద క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీ క‌ర‌ణ మీద సైతం విది విధానాలు త్వ‌ర‌లోనే సిద్దం అవుతాయ‌ని ఉన్న‌తాధికారి స్ప‌ష్టం చేసారు. ఇక‌, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం నెల రోజుల పాటు మాత్ర‌మే కొన‌సాగించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. దీంతో పాటుగా ఇప్ప‌టికే ఆశా, మున్సిప‌ల్, అంగ‌న్ వాడీ ఉద్యోగుల జీతాల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం ర‌ద్దు పైన నివేదిక వ‌చ్చిన త‌రువాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

English summary
AP Govt issued orders to implement 27 percent Interim Relief for State govt employees and pensioners form 1st of this month. As per Cm jagan assurance cabinet approved this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X