వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్: రొటేషన్..షిఫ్టు పద్దతుల్లో హాజరు ఇలా: ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు.

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల నేతల వినతి మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇంటి నుండే పని చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంతో పాటుగా వివిధ శాఖల ప్రధాన కార్యలయాలు..అదే విధంగా జిల్లా కార్యాలయాల్లోనూ ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించి షిఫ్టు..రొటేషన్ పద్దతిన విధులకు హాజర య్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. అయితే, గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

 ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం...

ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం...

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇంటి నుండే పని చేసే వెసులుబాటు కలిగించింది. సోషల్ డిస్టన్స్ నిర్వహణలో భాగంగా ఒకే సారి ఉద్యోగులు కార్యాలయాకు రాకుండా.. ఉద్యోగులను విభజించి రొటేషన్.. షిఫ్ట్ పద్దతి న విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందు కోసం ఉద్యోగులను రెండు గ్రూప్ లుగా విధులకు హాజరయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్దుం చేసుకోవాలని ఆదేశించింది. ఏపీ సచివాలయంతో పాటుగా..హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లాల కార్యాలయాల్లో ను రెండు గ్రూప్ లు గా ఉద్యోగుల విధులకు హాజరు కావొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 గెజిటెడ్ అధికారులు మాత్రం హాజరు కావాల్సిందే

గెజిటెడ్ అధికారులు మాత్రం హాజరు కావాల్సిందే

గెజిటెడ్ అధికారులు మాత్రం విధులకు హాజరు కావాలని పేర్కొంది. ఇక 60 ఏళ్ల వయసు పైబడిన సలహాదారు లు, చైర్ పర్సన్లు ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 50 ఏళ్ళు వయస్సు పైబడి శ్వాసకొస సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న అధికారులు... ఏప్రిల్ 4 తేదీ వరకు ఇంటి వద్దే వైద్య ధ్రువీకరణ లేకపోయినా ఇంటి వద్దే ఉండొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయంలో సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సహా దిగువ స్థాయి కేడర్ లోని ఉద్యోగులంతా రెండు గ్రూప్ లు గా ఏర్పడి ప్రత్యామ్నాయ వారాల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది.

 షిఫ్టు పద్దతిన ఉద్యోగుల హాజరు..

షిఫ్టు పద్దతిన ఉద్యోగుల హాజరు..

ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. షిష్టు..రొటేషన్ పద్దతిలో హాజరయ్యే ఉద్యోగులు కు 9.30 గంటలు, 10 గంటలు, 10.30 గంటల వేర్వేరు షిఫ్టులో హాజరుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. హెచ్ఓడీల అనుమతితో ఇంటి వద్ద నుండే పని చేసేందుకు అవకాశం దక్కించుకున్న ఉద్యోగులు ఈ -ఆఫీసు ద్వారా విధులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఈ ఉత్తర్వులు అత్యవసర సేవల విభాగాలకు వర్తించవని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు , సహకార సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు వర్తిస్తుందని అదేశాల్లో పేర్కొన్న ప్రభుత్వం..ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించింది.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
 ఏప్రిల్ 4 వరకు అమలు

ఏప్రిల్ 4 వరకు అమలు

తదుపరి ఉత్తర్వుల వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం..వీలైనంత మేరకు ప్రభుత్వం కార్యాలయంలోకి సందర్శకులను అనుమతి ఇవ్వరాదని సూచించింది. సచివాలయం, హెచ్ ఓ డి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మందికి విధులకు హాజరు అయ్యేలా, మరో 50 శాతం మంది ఇంటి వద్ద నుంచే పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 4 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేసారు.

English summary
Amid the coronavirus outbreak AP govt issued orders for all the govt employees to work from home.A GO had been issued for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X