• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్ : కిరణా, మందుల షాపులకు ఏపీ సర్కార్ హెచ్చరికలు- పాటించకుంటే..

|

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గత వారం ఆరంభంలో 30 కేసులు కూడా దాటని పరిస్ధితి నుంచి తాజాగా పాజిటివ్ కేసులు 266కు చేరిపోవడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఉదయం షాపింగ్ సమయాల్లో జనం రద్దీ వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం షాపులు, సూపర్ బజార్ల యజమానులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని సూచించింది.

ఉదయం షాపింగ్ తో పెరుగుతున్న కేసులు..

ఉదయం షాపింగ్ తో పెరుగుతున్న కేసులు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఉదయం పరిమితంగా షాపింగ్ కు ప్రభుత్వం అనుమతిస్తోంది. కానీ ప్రజల రద్దీ దృష్ట్యా ఈ సమయాల్లోనూ పలుమార్లు మార్పులు చేశారు. అయితే తాజాగా షాపింగ్ వల్ల కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు రావడంతో నిత్యావసర సరుకులైన కిరాణా, పాలు, పండ్లు, కూరగాయలు, మందులు అమ్ముతున్న దుకాణాదారులు, సూపర్ మార్కెట్లకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఇకపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే వారు అమ్మకాలు నిర్వహించాల్సి ఉంటుంది.

 వీరికి షాపుల్లో నో ఎంట్రీ...

వీరికి షాపుల్లో నో ఎంట్రీ...

ఏపీ సర్కార్ తాజా మార్గదర్శకాల ప్రకారం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మాసీల్లో పనిచేసే వారికి కరోనా వైరస్, ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటే వారు పనికి వెళ్లరాదు. ఇలాంటి లక్షణాలను షాపుల యజమానులు గుర్తించినా వారిని పనిలోకి రానివ్వకుండా నిరోధించాలి. నిబంధనలను ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైతే ప్రభుత్వం అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం జైలుశిక్ష, జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటుంది.

 వినియోగదారులపై ఆంక్షలు..

వినియోగదారులపై ఆంక్షలు..


స్టోర్‌లలో రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు లోపలకు వచ్చే వినియోగదారుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో కోరింది. అలాగే రెండువారాలకు మించి నిల్వ ఉంచిన సరుకులు వినియోగదారులు కొనకుండా చూడాలి. కస్టమర్లు వేచి ఉండాల్సి వస్తే క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. వినియోగదారుల మధ్య రెండు మీటర్లు, లేదా ఆరు అడుగుల దూరం ఉండేలా గుర్తులను వెయ్యాలి. పెద్ద పార్కింగ్ సదుపాయం ఉన్న దుకాణదారులు కస్టమర్ల ఫోన్ నంబర్ల ద్వారా ఎస్‌ఎమ్‌ఎస్ టోకెన్ విధానాన్ని అమలు చేయాలి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చెయ్యడానికి ప్రాధాన్యాత ఇచ్చి, ఇంటికే డెలివరీ చెయ్యాలి..

 ఎక్కడికక్కడ చెక్‌ లు...

ఎక్కడికక్కడ చెక్‌ లు...

ఏపీ ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సరుకులు అమ్మేవారంతా తమ ఉద్యోగస్తులకు సైతం ఎప్పటికప్పడు శరీర ఉష్ణోగ్రత చూడాలి
. 101 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత దాటితో స్టోర్‌లలోకి వారిని అనుమతించకూడదు .స్టోర్‌లలో ప్రవేశ ద్వారాల వద్ద, బయటికి వెళ్లే చోట హ్యాండ్ శానిటైజర్‌ను తప్పనిసరిగా ఉంచాలి.
వినియోగదారులు వీలైనంత తక్కువ వస్తువులను తాకాలని సూచించాలి. బిల్లులు చేసేవారు మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం చాలా అవసరం. వీలైనంత ఎక్కువగా ఆన్‌లైన్ చెల్లింపులు జరిగేలా చూసుకోవాలి
అలా కానిపక్షంలోనే నగదు తీసుకోవాలి.. అలాగే నగదు ఇచ్చేటప్పుడు వలలను వాడాలి.
వినియోగదారుల నుంచి డబ్బులను చేతితో తీసుకోకుండా వలలో వేయాలని సూచించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో సూచించింది.

English summary
due to increase in coronaviurs positive cases in the state ap govt issued new guidelines for essential goods suppliers like grocery and medicines. in these guidelines govt ask super bazaars, kirana stores, grocery shops and medical shopts not to insist their employees suffering from coronavirus symptoms. govt also asks them to restrict entry of customers as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X