భారీగా జిల్లా ఎస్పీల బదిలీ - తిరుపతికి సుబ్బరాయుడు, ఎవరెక్కడ..!!
ఏపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీ పై కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐపీఎస్ అధికారుల బదిలీల పైన నిర్ణయం తీసుకున్నారు. కసరత్తు తరువాత 14 మంది అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయించారు. 14 జిల్లాల ఎస్పీలను మార్పు చేసారు. ఎస్పీల పనితీరు, శాంతిభద్రతల కోణంలో మార్పులు జరిగాయి. కాగా, 12 జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగించారు. ఈ నెల 14,15 తేదీల్లో కలెక్టర్ల సదస్సు వేళ బదిలీల పైన ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం పాలనా పరమైన ప్రక్షాళన ప్రారంభించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఈ రోజున ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులకు అవకాశం కల్పించగా .. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేసారు. 12 జిల్లాల ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించిన ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకుంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ - రాహుల్ మీనా, బాపట్ల- ఉమామహేశ్వర్, నెల్లూరు - అజితా వేజెండ్ల, తిరుపతి - సుబ్బారాయుడు, అన్నమయ్య - ధీరజ్ కునుగిలి, కడప - నచికేత్, నంద్యాల్ - సునీల్ షెరాన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడుగురు కొత్త అధికారులు.

కాగా, విజయనగరం- ఎఆర్ దామోదర్, కృష్ణా - విద్యాసాగర్ నాయుడు, గుంటూరు - వకుల్ జిందాల్, పల్నాడు - డి కృష్ణారావు, ప్రకాశం- హర్షవర్థన్ రాజు, చిత్తూరు - తుషార్ డూడి, శ్రీ సత్యసాయి - సతీష్ కుమార్ ను నియమించారు. ప్రస్తుతం గుంటూరు ఎస్పీగా ఉన్న సతీష్ కు సత్యసాయి జిల్లా బాధ్యతలు అప్పగించారు. యథాతథంగా శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి ఎస్పీలు కొనసాగనున్నారు. ఐజీ నుంచి పై స్థాయి అధికారుల బదిలీలు ఉంటాయని ప్రచారం సాగినా.. ప్రస్తుతం జిల్లాల ఎస్పీలకే బదిలీలను పరిమితం చేసారు.












Click it and Unblock the Notifications