అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఈ డైరెక్టరీ: ఒక్క క్లిక్‌తో అమరావతిలోని ఆఫీస్ అడ్రసులు, ప్రత్యేకతేంటి?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని నుంచే పరిపాలన ప్రారంభమైన నేపథ్యంలో రాజధాని అమరావతికి హైదరాబాద్ నుంచి పలు శాఖలు తరలివస్తున్నాయి. అంతేకాదు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఆయాశాఖలకు అధికారులు కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎక్కడ అనువైన భవనం లభిస్తే అక్కడ రాష్ట్ర స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏపీ హోంశాఖతో పాటు మరికొన్ని శాఖలు అమరావతికి తరలి రావాల్సిన జాబితాలో ఉన్నాయి. అమరావతికి తరలివచ్చిన శాఖల కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కొంచెం కష్టమే.

ఈ ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వ ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ విభాగం ఓ నూతన యాప్‌ను రూపొందించింది. ఈ విభాగం కమిషనర్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పిఎఫ్‌) అదనపు డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఈ యాప్‌‌ను రూపొందించారు. 'ఏపీ ఈ-డైరెక్టరీ' అని ఈ యాప్‌కి పేరుపెట్టారు.

శుక్రవారం గుంటూరు అరండల్‌పేటలోని ఎస్‌పీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ యాప్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్‌ తోడుంటే అరచేతిలో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లేనని అన్నారు. ఈ యాప్‌లో 30 కార్యాలయాల వివరాలు, ఫోన్‌ నంబర్లు, ఇతర సమాచారాన్ని పొందుపరిచినట్టు ఆయన తెలిపారు.

ఇందులో సీఎం, గవర్నర్‌, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సెక్రటేరియెట్‌, అసెంబ్లీ, ఎమర్జెన్సీ విభాగాలు, అంబులెన్స్‌, మీడియా, జ్యుడీషయరీ, ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారుల, కార్యాలయాల సమగ్ర సమాచారం ఉందన్నారు. తొలి విడతగా 140 ప్రభుత్వ శాఖల కార్యాలయాల సమాచారం పొందుపరుస్తామని, రెండో విడతలో జిల్లా స్థాయి కార్యాలయాల పూర్తి వివరాలను అందిస్తామని ఆయన అ్నారు.

'ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోని గూగుల్‌ ప్లే స్టోర్‌ని క్లిక్‌ చేయగానే 'ఏపీ ఈ-డైరెక్టరీ' యాప్‌ కనిపిస్తుంది. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా యాప్‌ పని చేస్తుందన్నారు.

ఏపీ ఈ డైరెక్టరీ యాప్‌ను ఈ లింక్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

English summary
Andhra Pradesh govt launches e directory in google for office address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X