ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణలో భారీ మార్పుకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటి వవరకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలను ఇకపై భీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు..భీమా కంపెనీలతో కీలక భేటీ నిర్వహించారు. భీమా సదుపాయాల పైన వారితో చర్చించారు. భీమా విధానంలో ఆరోగ్య శ్రీ సేవలపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు.
భీమా విధానంలో సేవలు
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్య శ్రీకార్డు ద్వారా రూ 25 లక్షల వరకు వైద్య సాయం అందుతోంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా ఈ సేవలను కొనసాగిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ సేవలను ట్రస్టు ద్వారా కాకుండా భీమా విధానంలో అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ భీమా కంపెనీలతో చర్చలు చేసింది. ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యే నాటికి భీమా విధానం ముసాయిదా రూపొందించాలని కసరత్తు కొనసాగుతోంది.

ఆరోగ్య శాఖ కసరత్తు
ఆరోగ్య శ్రీ ట్రస్తు ద్వారా రోగులకు వైద్య సేవలను ప్రారంభించిన తొలి నాళ్లల్లో భీమా విధానం అనుసరించారు. తర్వాత అనేక కారణాలతో ట్రస్టు విధానంలోకి మార్చారు. ప్రస్తుతం అనుబంధం ఆస్పత్రుల్లో రోగులు తీసుకున్న చికిత్స మేరకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. ఈ నిర్వహణలో అస్పత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పలు సందర్భాల్లో ఆరోగ్యశ్రీ సేవలు తాత్కాలికంగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. దీంతో, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు ద్వారా కాకుండా భీమా విధానంలో అమలు చేయాలని ఆలోచన చేస్తోంది.
ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు
భీమా విధానంలో అయితే, హెల్త్ కార్డులు ఉన్న వారు దేశ వ్యాప్తంగా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన భీమా కంపెనీ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆస్పత్రి నేరుగా భీమా కంపెనీకి సమాచారం ఇచ్చి అవసరమైన వారికి చికిత్స అందిస్తుంది. భీమా కంపెనీ నుంచి ఆస్పత్రికి చికిత్స మొత్తం అందుతుంది. రాష్ట్రంలో 1.35 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నాయి. 5.5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు ఈహెచ్ఎస్ ఉంది. కేంద్రం నుంచి అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ సేవలను పరిగణలోకి తీసుకొని కొత్త విధానం ఖరారు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.












Click it and Unblock the Notifications