• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా వ్యాక్సిన్ల కొరత: జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: ఒకట్రెండు రోజుల్లో

|

లక్నో: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని విధ్వంసానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొడుతోంది. జనం ప్రాణాలను హరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా మరణాలకు కారణమౌతోంది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ..మరణాల్లో పెరుగుదల చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసులు కూడా 37 లక్షలకు పైగా రికార్డయ్యాయి. అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. తొలి డోసు వేసుకున్న వారు రెండో డోసు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.

 కరోనా కట్టడి సక్సెస్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: మహారాష్ట్ర వెనక్కి..సౌత్ స్టేట్ టాప్ కరోనా కట్టడి సక్సెస్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: మహారాష్ట్ర వెనక్కి..సౌత్ స్టేట్ టాప్

 రెండో డోసుకు ప్రాధాన్యత..

రెండో డోసుకు ప్రాధాన్యత..

వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి అనేక రాష్ట్రాల్లో నెలకొంది. చాలినన్ని టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల పలు రాష్ట్రాలు మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఉత్పాదక సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ.. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఉండట్లేదు. రాష్ట్రాలే వ్యాక్సిన్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుందంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా తేల్చేయడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిించాల్సి వస్తోంది. ఏపీ ప్రభుత్వం తొలి డోసు వ్యాక్సిన్‌ను కూడా తాత్కాలికంగా నిలిపి వేసింది. రెండో డోసు కోసం ఎదురు చూస్తోన్న వారికి ప్రాధాన్యత ఇస్తోంది.

గ్లోబల్ టెండర్ల వైపు మొగ్గు..

గ్లోబల్ టెండర్ల వైపు మొగ్గు..

వ్యాక్సిన్ల కొరతను అధిగమించడంలో భాగంగా జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ ఇటెండర్లను పిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో బిడ్డింగుల ప్రక్రియను చేపట్టడానికి సమాయాత్తమౌతోందని అంటున్నారు. గ్లోబల్ టెండర్ల ద్వారా ఎంత మొత్తంలో వ్యాక్సిన్‌ను సమీకరించుకోవాలనేది ఇంకా ఖరారు కాలేదని, దానిపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంటనే బిడ్డింగులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను కూడా దాఖలు చేసిన నేపథ్యంలో.. అదే విధానాన్ని అనుసరించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇది వరకు యూపీ సర్కార్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మైనస్ రెండు డిగ్రీల నుంచి మైనస్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోవడానికి వీలుండేలా టీకాలను సమీకరించుకోనుంది.

మహారాష్ట్ర కూడా అదే బాటలో..

మహారాష్ట్ర కూడా అదే బాటలో..

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తొలి రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్లను సమీకరించుకోవడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనుంది. ఈ దిశగా చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్లతో పాటు రెమ్‌డెసిివిర్ ఇంజెక్షన్లను కూడా మహారాష్ట్ర సర్కార్ గ్లోబల్ టెండర్ల ద్వారా సమీకించుకోబోతోంది. దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియను ఇంకా చేపట్టలేదు. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్ల లభ్యత లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని సమీకరించుకోవాల్సి వస్తోందంటూ అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

English summary
The Andhra Pradesh government has likely to go global tender for procure Covid-19 vaccines soon. Uttar Pradesh government has already issued the global tenders for procuing 40 million doses within six months of vaccines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X