వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెల్ కొట్టనున్న కరోనా పేషెంట్స్ ... ఏపీలో కోవిడ్ ఆస్పత్రుల్లో రోగుల కోసం సర్కార్ కొత్త యోచన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. కరోనాతో బాధపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోవిడ్ ఆసుపత్రులలో అడ్మిట్ అయిన రోగుల కోసం బెడ్స్ వద్ద బెల్ సౌకర్యం అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు .

వ్యాప్తి కారణంగా కరోనా పేషెంట్ లకు దగ్గరగా ఉండలేని వైద్య సిబ్బంది

వ్యాప్తి కారణంగా కరోనా పేషెంట్ లకు దగ్గరగా ఉండలేని వైద్య సిబ్బంది

ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చాలామంది ఈ మహమ్మారికి బలైపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.ఏపీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా బాధితులు ఆసుపత్రులలో తమ ఇబ్బందులను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగుల వద్ద ఉండలేని పరిస్థితి.

రోగులను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలకు చెక్ పెట్టేలా బెల్ సౌకర్యం

రోగులను పట్టించుకోవటం లేదన్న ఆరోపణలకు చెక్ పెట్టేలా బెల్ సౌకర్యం

ఈ నేపథ్యంలో కరోనారోగులను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కరోనారోగుల వద్ద బెల్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచ బోతున్నట్లుగా తెలుస్తోంది. కరోనా రోగుల వద్ద ఉన్న ఈ బెల్ వారు కొట్టిన వెంటనే రిసెప్షన్ కు అనుసంధానమై, సదరు పేషెంట్ వద్దకు వైద్య సిబ్బంది వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. రోగి బెల్ నొక్కిన వేంటనే అక్కడ అందుబాటులో ఉన్న నర్సు గాని, డాక్టర్ కానీ రోగి వద్దకు వెళ్లి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందిస్తారు.

 రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో బెల్ .. రిసెప్షన్ కు అనుసంధానం

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో బెల్ .. రిసెప్షన్ కు అనుసంధానం

రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆసుపత్రులలో ఐసియు ,నాన్ ఐసియు,ఆక్సిజన్, జనరల్ వార్డ్ లలో ఈ బెల్ సౌకర్యాన్ని కల్పించబోతున్నామని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక ఈ సౌకర్యం ద్వారా ఎమర్జెన్సీ ఉన్న రోగులను గుర్తించడం సులభమవుతుంది అని భావిస్తున్నారు. అంతేకాదు కరోనాతో బాధపడుతున్నవారికి ఎప్పుడు ఏమౌతుందో అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి, వారికి ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా బెల్ కొట్టి నట్లయితే డాక్టర్లు కావలసిన వైద్య సలహాలను లేదా వారికి కావలసిన చికిత్సను అందిస్తారు.

Recommended Video

AP Colleges To Reopen From October 15 | Assistant Professors Recruitment : AP CM YS Jagan
 బెల్ కొడితే అవసరం అయిన వారికి తక్షణం వైద్యం అందించే నయా ఆలోచన

బెల్ కొడితే అవసరం అయిన వారికి తక్షణం వైద్యం అందించే నయా ఆలోచన

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచి నిర్ణయమని అటు కరోనా బాధితులు, బాధితుల బంధువులు అంటున్నారు. కరోనా పేషెంట్ పక్కనే ఉండ లేని పరిస్థితుల్లో ఈ బెల్ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆస్పత్రుల్లో అడ్మిట్ అయిన కరోనా బాధితులు తమను పట్టించుకోవటం లేదన్న భావన నుండి బయటకు తీసుకురావటానికి, అలాగే అవసరం అయిన వారికి తక్షణం వైద్యం అందించటానికి ఈ ఆలోచన ఎంతగానో ఉపయోగపడనుంది .

English summary
The government has taken a new decision recognizing the plight of corona victims in the state of Andhra Pradesh. The decision was made to make available the Bell facility at the beds for patients admitted in various Covid hospitals across the state suffering from corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X