విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో రాజ్ భ‌వ‌న్ : 24న కొత్త గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం: అక్క‌డే బ‌స‌..నోటిఫికేష‌న్ జారీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

24న ఏపీ గ‌వ‌ర్న‌ర్ గా ప్ర‌మాణ స్వీకారం చేయనున్న బిశ్వ‌భూషణ్ || AP Governor Take Oath On 24th Of July

ఏపీ రాజ‌ధానిలో రాజ్ భ‌వ‌న్ ఖ‌రారైంది. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ను నియ‌మిస్తూ రాష్ట్రప‌తి ఉత్త ర్వులు జారీ చేయ‌టంతో ఆయ‌న ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 24న కొత్త గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు. ఇక‌, గ‌వ‌ర్న‌ర్ ఇక్క‌డే ఉండేందుకు వీలుగా ఆయ‌నకు అధికారిక కార్యాల‌యాన్ని..నివాసంతో పాటుగా కేటాయించారు. దీని కోసం విజ‌య‌వాడ లోని పాత ఇరిగేష‌న్ కార్యాల‌యాన్ని ఖ‌రారు చేసారు. గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శిగా ముఖేష్ కుమార్ మీనాను నియ‌మిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

24న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ స్వీకారం..
ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఈనెల 22న తిరుప‌తి రానున్నారు. 23న శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్న త‌రువాత విజ‌య‌వాడ‌కు వెళ్తారు. 24న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌వీణ్ కుమార్ ఆయ‌నతో ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు. ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన బిశ్వ‌భూషణ్ హ‌రి చంద‌న్‌తో ఇప్ప‌టికే మాట్లాడిన ఏపీ సీఎం ముఖ్య‌మంత్రి ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు.

AP Govt notified Raj Bhavan in Viayawada. Previously used Irrigation office now using as Raj Bhavan.

ఆ వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం..నివాసం కోసం ఏర్పాట్లు చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. దీంతో..సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ అధికారుల‌తో పాటుగా ప్రోటోకాల్ అధికారులు రెండు కార్యాల‌యాల‌ను ప‌రిశీలించారు. రెండు కార్యాల‌యాల్లోని వ‌స‌తి..సౌక‌ర్యాల గురించి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్వి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంకు నివేదిక ఇచ్చారు. దీంతో..ఆయ‌న ఈ అంశం పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తుది చ‌ర్చ‌లు జ‌రిపి నిర్ణ‌యం తీసుకున్నారు.

విజ‌య‌వాడ‌లోనే రాజ్ భ‌వ‌న్‌..నోటిఫికేష‌న్ జారీ
ముఖ్య‌మంత్రి సైతం ఆమోదం తెల‌ప‌టంతో విజ‌య‌వాడ బంద‌ర్ రోడ్డులోని పాత ఇరిగేష‌న్ కార్యాల‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం..అధికారిక నివాసం రాజ్ భ‌వ‌న్‌గా గుర్తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 2015లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుండి వ‌చ్చి ఏపీ నుండి పాల‌న చేయాల‌ని భావించిన స‌మయంలో ఇదే భ‌వ‌నం నుండి ప‌ర్య‌వేక్షించారు. ఆ త‌రువాత ఆ భ‌వ‌నంలో పెద్ద ఎత్తున మ‌ర‌మ్మ‌త్తులు చేసారు.

రెండు అంత‌స్థుల్లో ఉండే ఈ భ‌వ‌నంలో కింది ఫ్లోర్ మొత్తం కార్యాల‌యం కోసం..రెండో అంత‌స్థ‌లో పూర్తి సౌక‌ర్యాల‌తో గ‌వ‌ర్న‌ర్ అధికారిక నివాసంగా ఖ‌రారు చేసారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం రాజ్ భ‌వ‌న్‌లో ఉన్న సిబ్బందిని ఏపీకి వ‌చ్చే వారికి ఇక్క‌డ‌కు వ‌చ్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌వర్న‌ర్ కార్య‌ద‌ర్శిగా ప్ర‌స్తుతం గిరిజన సంక్షేమ కార్య‌ద‌ర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

English summary
AP Govt notified Raj Bhavan in Viayawada. Previously used Irrigation office now using as Raj Bhavan, Now Governor take oath on 24th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X