వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుట్రతోనే జగన్ సర్కార్ సిట్ విచారణ, 9 నెలల్లో చేసిన పనులపై ఎంక్వైరీ జరిపించండి: టీడీపీ

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని పేర్కొన్నారు. వారికి తమ తప్పులు కనిపించడం లేదన్నారు. కుట్రతోనే సిట్ విచారణకు ఆదేశించారని ఆరోపించారు. సిట్ విచారణ వెనక ప్రభుత్వ కుట్ర ఉందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి రాజధాని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ సిట్‌తో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా స్పందించారు.

కక్షసాధింపు చర్యలు..

కక్షసాధింపు చర్యలు..


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి తప్పుచేయలేదని బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. సిట్ విచారణకు భయపడబోమని తేల్చిచెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసినా చంద్రబాబు నాయుడుపై అవినీతి మరకలేదని గుర్తుచేశారు. ఇసుక, లిక్కర్, పెన్షన్లపై సీబీఐ విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వాన్ని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

వివేకా కేసు ఎందుకివ్వరు..?

వివేకా కేసు ఎందుకివ్వరు..?

జగన్ చిన్నాన్న వివేకానంద హత్యకేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కానీ గత ప్రభుత్వంలో చేసిన పనులపై మాత్రం సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తారు అని విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన పనులన్నీ తెరిచిన పుస్తకం అని, ఎలాంటి తప్పులు జరగలేదన్నారు. గత ప్రభుత్వంతోపాటు 9 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనే సమాచారం కోసం కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

9 నెలల పాలనపై కూడా..?

9 నెలల పాలనపై కూడా..?

ఇదే అంశంపై మరో నేత బోండా ఉమా కూడా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఏ తప్పు చేయలేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్దమని తేల్చిచెప్పారు. అయితే 9 నెలల పాలనలో జరిగిన పనులపై సీఎం జగన్ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తోపాటు విశాఖలో భూములు, ఇసుక, మద్యం అమ్మకాలపై కూడా విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. పోలీసు అధికారులతో సిట్ ఎలా ఏర్పాటు చేస్తారని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

English summary
andhra pradesh government order sit enquiry is Conspiracy tdp leader buddha venkanna alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X