వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరట

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా, నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలన్ని పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా తాజా ఉత్తర్వులిచ్చారు..

ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసుఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసు

రాష్ట్రంలోని ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో నిర్ధారిత ట్యూషన్ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఆయా కాలేజీలు.. ట్యూషన్‌ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలన్న ప్రభుత్వం.. ఒకవేళ ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా,

 ap govt orders private and aided colleges to reduce tuition fees by 30% amid covid pandemic

కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త కేసులు, మరణాలు క్రమంగా తగ్గడంతో విద్యా సంస్థల పున:ప్రారంభంపై ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేయడం తెలిసిందే. నవంబర్ 02 నుంచి స్కూళ్లు, కాలేజీలు మళ్లీ మొదలుకానున్నాయి. తొలుత 9,10 తరగతులతోపాట ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అవుతాయి. నవంబర్-23 నుంచి 6,7,8 నుంచి తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక..

బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్

1 నుంచి 5వ తరగతి పిల్లలు డిసెంబర్14 నుంచి బడులకు వెళ్లాల్సి ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తామని, ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ట్యూషన్ ఫీజు తగ్గింపు నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించినట్లయింది.

English summary
Andhra Pradesh state government has issued orders to reduce tuition fees by 30 per cent in private, aided and unaided colleges. Department of Education issued orders to this effect on Friday night. the govt is taking these steps in the wake of financial difficulties due to covid-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X