వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కేసీఆర్ పై అభిమానం హద్దులు దాటుతోంది..! నేతలు, మంత్రుల భజన.. జగన్ చెప్పారా ?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఏపీ మంత్రుల అభిమానం హద్దులు దాటుతోంది. విమర్శలకు కారణమవుతోంది. ఏపీకి వచ్చిన కేసీఆర్ కు తెలంగాణ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలకాలి. వెళ్లే సమయంలో వీడ్కోలు ఇవ్వాలి. ఇది ఎవరు అధికారంలో ఉన్నా మర్యాద పాటించాలి. అంత వరకూ ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, ఏపీ మంత్రులు మరి ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేసారో..లేక వారి సొంత భక్తి చాటుకుంటున్నారో కానీ..అవసరానికి మించి వినయం..భజన చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాట కాంచీపురం పర్యటన కోసం రేణిగుంట విమనాశ్రయానికి వచ్చారు. అక్కడ ఏపీ మంత్రులు స్వాగతం పలికారు. అంత వరకు బాగానే ఉంది. ఆయనతో పాటుగా ఒక డిప్యూటీ సీఎం.. ఒక సీనియర్ మంత్రి..ఒక ఎంపీ కాంచీపురం దాకా ఫాలో అయ్యారు. తిరుగు ప్రయాణంలోనూ ఆయనతో పాటే ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో వీడ్కోలు పలికే వరకూ తెలంగాణ సీఎం కోసమే సమయం కేటాయించారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీలోనే కాదు.. ప్రభుత్వ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

పార్టీ పరంగా అయితే ఓకే..ప్రభుత్వంలోని మంత్రులుగా ఉంటూ..

పార్టీ పరంగా అయితే ఓకే..ప్రభుత్వంలోని మంత్రులుగా ఉంటూ..

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యత స్వీకరించిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు నడుపుతున్నారు. తెలుగు ప్రజల సమస్యల నీటి సమస్యల పరిష్కారం కోసం కసరత్తు చేస్తున్నారు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయించారు. అంతవరకు బాగానే ఉంది. ఎవరికీ అభ్యంతరాలు లేవు. మఖ్యమంత్రి హోదా లో జగన్ హైదరాబాద్ లోని తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సమయంలో..అదే విధంగా ఏపీ సీఎం నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో ఇద్దరూ ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసారు. అది కూడా ఎవరూ అభ్యంతం చెప్పలేరు. కానీ, శాసనసభ సమావేశాల్లోనూ..బయటా ఏపీ మంత్రులు అనేక సందర్భాల్లో అవసరానికి మించి కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించారు. ఒక వైపు కేసీఆర్ తో జగన్ సాగునీటి పంపకాల మీద చర్చలు సాగుతున్న సమయంలో ప్రతిపక్షంతో పాటుగా అనేక మంది పలు సూచనలు చేసారు. సత్సంబంధాలు అవసరమే అయినా.. ఏపీ మంత్రులుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ పక్క రాష్ట్రంలో కార్యక్రమానికి వెళ్తున్న ఆయనతో కలిసి వెళ్లటం.. వారి ప్రాధాన్యతలను పక్కన పెట్టి మరీ ఆయన కోసం రోజంతా కేటాయించటం పైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. అదే విధంగా గతంలో వైసీపీ నేతల పేర్లతో కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ అనేక ఫ్లెక్సీలు వెలిసాయి. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.

ఉదయం నుండి రాత్రి దాకా మంత్రులు ఫాలో అవుతూ..

ఉదయం నుండి రాత్రి దాకా మంత్రులు ఫాలో అవుతూ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడులోని కాంచీపురం పర్యటన కోసం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా మంత్రుల హోదాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు. కేసీఆర్ తో కలిసి కాంచీపురం వెళ్లారు. మధ్యలో నగరిలో రోజా ఘనంగా స్వాగతం పలికారు. రోజా సైతం కేసీఆర్ కుటుంబంతో కలిసి కాంచీపురం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కేసీఆర్ వైసీపీ ఎమ్మెల్యే రోజా నివాసానికి వచ్చారు. అక్కడ గులాబీ పూలను పరిచి కేసీఆర్ కు స్వాగతించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి విందు ఇవ్వటం రోజా వ్యక్తిగత విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి..ప్రజల పైన ఎటువంటి ప్రభావం చూపదు. దీంతో దీని పైన విమర్శలు లేవు. కానీ, అక్కడా మంత్రులు ఉన్నారు. ఆ తరువాత రేణిగుంట నుండి కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగి వెళ్లే వరకు ఆయనతోనే ఉన్న ఇద్దరు మంత్రులు వీడ్కోలు పలికారు. స్వాగతం..వీడ్కోలు కార్యక్రమాలకు పరిమితం కావాల్సిన మంత్రులు ఇంతలా..కేసీఆర్ తో ఏపీలో కాదు.. తమిళనాడు పర్యటనలోనూ అనుస రించి..తమ భక్తి చాటుకొనే ప్రయత్నం చేసారు. మంత్రులుగా ఉన్న ఈ ఇద్దరు తెలంగాణ సీఎం తమిళనాడు కార్యక్రమానికి సారధ్యం వహించటం పైనే ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరితో ఆగలేదు. తిరుమలకు వస్తే స్వాగతం పలకాల్సిన టీటీడీ చైర్మన్ నగరి వెళ్లి రోజా నివాసంలో కేసీఆర్ ను కలిసారు.

ముఖ్యమంత్రి సూచించారా..తెలిసే జరిగిందా..

ముఖ్యమంత్రి సూచించారా..తెలిసే జరిగిందా..

ఇప్పుడు జగన్ కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి సూచనల మేరకే ఇంతగా భక్తి చాటారా..లేక వారి వ్యక్తిగత నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పలు మార్లు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఏ మంత్రి వచ్చి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలకలేదు. ప్రయివేటు పనుల మీద వచ్చిన సమయంలో ఆ అవసరం కూడా స్థానిక ప్రభుత్వానికి లేదు. అందుకే తెలంగాణ మంత్రులు రాలేదు. కేసీఆర్ నివాసానికి వెళ్తే స్వాగతించారు. అంతే కానీ, జగన్ హైదాబాద్ లో ఎక్కడికి వెళ్లినా అక్కడి మంత్రులు అనుసరించలేదు. కానీ, కాంచీపురం పర్యటనలో మాత్రం భిన్నంగా సాగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. వాటి కారణంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ..ఆయన తనయుడు ఎంపీ అయిన మిధున్ రెడ్డి సైతం కేసీఆర్ పైన అభిమానం చాటుకుంటున్నారా అనే సందేహం మొదలైంది. అయితే, మిధున్ రెడ్డి గురించి చర్చ లేకపోయినా..మంత్రి హోదాలో ఉన్న వారి గురించే ఇప్పుడు చర్చ. మరి..
ఎన్నికల సమయంలో తనకు సహకరించిన కేసీఆర్ రుణం జగన్ తీర్చుకుంటున్నారనే ఆరోపణలకు ఇవి మరింత ఊతమిస్తున్నాయి. దీని పైన మంత్రులు ఏం చెబుతారనేది వేచి చూడాలి.

English summary
AP Govt over effection on Telangana CM KCR.In KCR Tamilanadu tour AP Ministers taken total responsibililty till the end. Now This issue became controversy in AP politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X