వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం: ఏపీ అవరతరణ దినోత్సవం..ఇక ఏ రోజంటే: అయిదేళ్లుగా దూరంగా..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన నాటి నుండి ఏపీ ప్రజలకు దూరమైన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను ఈ ఏడాది నుండి నిర్వహించాలని నిర్ణయించారు. 2013వ సంవత్సరం వరకూ ప్రతీ ఏటా నవంబర్ 1న ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించే వారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ఏర్పడిన జూన్ 2న ఆ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం 2014 నుండి నిర్వహిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ మాత్రం ఏపీకి ఆవిర్భావ దినోత్సవం ఖరారు చేయకుండా..రాష్ట్ర విభజ జరిగిన రోజు జూన్ 2 నుండి వారం రోజుల పాటు ప్రతీ ఏటా నవ నిర్మాణ దీక్ష పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.

కానీ, అయిదేళ్లు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు మాత్రం చేయలేదు. దీని పైన అనేక ప్రజా సంఘాలు ప్రభుత్వానికి వినతులు చేసాయి. ఏపీ విడిపోయింది కాబటటి..తొలుత జరుపుకున్న అక్టోబర్ 1న ఏపీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని కోరాయి. కానీ, ముఖ్యమంత్రి జగన్ దీని పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక నుండి ప్రతీ ఏటా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతకీ ఆయన ఇందు కోసం ఏ తేదీ ఖరారు చేసారంటే..

ఆర్టీసీ విలీనం : జగన్ చేసింది కేసీఆర్ చెయ్యలేడా : తెలంగాణా సీఎం నిర్ణయంలో మతలబు ఇదేనా ? ఆర్టీసీ విలీనం : జగన్ చేసింది కేసీఆర్ చెయ్యలేడా : తెలంగాణా సీఎం నిర్ణయంలో మతలబు ఇదేనా ?

ఇక నుండి ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఇక నుండి ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఈ అయిదేళ్ల కాలంలో ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించ లేదు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఏపీలో విభజన ద్వారా కసి ఏర్పడాలని..దాని ద్వారా రాష్ట్రంలో నైరాశ్యం లేకుండా డెవలప్ మెంట్ దిశగా అందరూ కసితో పని చేసే విధంగా వారిలో ఉత్తేజాన్ని నింపటం కోసమే ఈ నవ నిర్మాణ దీక్ష చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తెలంగాణ మాత్రం రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న ప్రతీ ఏటా ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవటం కొనసాగిస్తోంది. ఇక, ఏపీలో మాత్రం రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది లేకుండా పోయింది.

కేంద్రానికి నాటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

కేంద్రానికి నాటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

అయితే..టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలనే చర్చ వచ్చింది. దీని పైన కేంద్రానికి నాటి ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర విభజన ద్వారా విడిపోయింది తెలంగాణ..ఏపీ ప్రాంతం మాత్రం అదే విధంగా ఉంది కాబట్టి..నవంబర్ 1నే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని సూచించింది. అయితే.. నాటి ప్రభుత్వం ఆ తేదీతో ఇప్పుడు అవతరణ దినోత్సవం జరపటం సమంజసం కాదని..తాము కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేదీ అంటే జూన్ 8న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపకుంటామని ప్రతిపాదించింది. అయితే, కేంద్రం ఈ అభిప్రాయంతో విభేదించింది. ఇక..ఆ ప్రతిపాదన అలాగే పెండింగ్ పడిపోయింది.

కొత్త ప్రభుత్వంలో ప్రజా సంఘాలు ఇలా..

కొత్త ప్రభుత్వంలో ప్రజా సంఘాలు ఇలా..

కొద్ది రోజుల క్రితం ఏపీలో ప్రజా సంఘాలు సమావేవమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తెలంగాణతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ జరుపుకున్న విధంగా అక్టోబర్ 1న నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. మరి కొందరు ఇదే తరహాలో ముఖ్యమంత్రికి లేఖ రాసారు. ఇక..అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఇదే అంశం మీద కొందరు ప్రముఖులతో చర్చించారు. ఏపీకి ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీని పైన ప్రజల్లో చర్చ జరిగే విధంగా ప్రభుత్వం త్వరలోనే తమ నిర్ణయాన్ని బయట పెట్టాలని భావిస్తోంది.

నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ వేడుకలు..

నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ వేడుకలు..

ముఖ్యమంత్రి జగన్ సైతం నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. ఏపీ నుండి తెలంగాణ జిల్లాలు విడిపోయినా..అదే ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రం కొనసాగుతుందని..త్వరలోనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తున్న పరిస్థితుల్లో ఏపీ అవతరణ దినోత్సవం మార్చుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో.. ఈ నెల 16న జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చించి తుది ఆమోదం తెలపనున్నారు. అయిదేళ్లుగా రాష్ట్రంలో జరపకుండా వదిలేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలో ఇక ఆ విధంగా జరగటానికి వీళ్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో..ఏపీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోరా అనే ప్రశ్నకు సమాధానం రానుంది.

English summary
AP Govt planning to announce state formation day celebrations to be done on November 1st. After state bifuercation AP did not performing state formation day. Since five years govt conducting Nava nirmana deeksha. In cabinet meet final decision may be announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X