వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మళ్లీ బంపర్ లాటరీ స్కీమ్ ? పరిశీలిస్తున్న జగన్ సర్కార్ ..

|
Google Oneindia TeluguNews

అసలే భారీ రెవెన్యూ లోటుతో సతమతం అవుతున్న ఏపీలో నిధుల లభ్యత భారీగా తగ్గిపోయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తాజాగా ఆర్ధిక సంక్షోభం నెలకొంది. దీంతో ఇప్పుడు నిధులు సమకూర్చుకునే అన్ని మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. వీటిలో బ్యాంకులు, వివిద ఆర్ధిక సంస్ధల నుంచి రుణాలతో పాటు ఉమ్మడి ఏపీలో రద్దు చేసిన కొన్ని పథకాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు.

ఏపీలో మళ్లీ లక్కీ లాటరీ పథకం..

ఏపీలో మళ్లీ లక్కీ లాటరీ పథకం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలైన, కొన్ని చోట్ల ఇప్పటికీ అమలవుతున్న లక్కీ లాటరీ పథకం ఏపీలో మరోసారి తెరపైకి వస్తోంది. నిధుల సంక్షోభంతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు లక్కీ లాటరీ పథకంపై దృష్టిపెట్టాయి. ఏపీలోనూ దీన్ని మరోసారి అమలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాక ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

 ఉమ్మడి ఏపీలో లాటరీలు రద్దు...

ఉమ్మడి ఏపీలో లాటరీలు రద్దు...

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో సక్సెస్ అయిన బంపర్ లాటరీ పథకం ద్వారా ప్రభుత్వంతో పాటు ఎంతో మంది వ్యక్తులు, సంస్ధలు కూడా ప్రయోజనం పొందాయి. అయితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి జీవితాలతో ఆటలాడుకుంటున్నట్లు ఆరోపణలు ఎదురు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీన్ని రద్దు చేశారు. లాటరీ కొని దానిపై ఎన్నో ఆశలు పెట్టుకుని అవి వాస్తవం కానప్పుడు జనం ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు ఎక్కువ కావడంతో అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 మళ్లీ తెరపైకి లాటరీలు.

మళ్లీ తెరపైకి లాటరీలు.

ఒకప్పుడు మధ్యతరగతి, పేదలు లక్కీ లాటరీలను ఎక్కువగా కొనేవారు. వీటిలో విజేతలుగా నిలిచిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహుమతి మొత్తంలో 30 శాతం పన్ను రూపంలో చెల్లించి మిగతా మొత్తాన్ని తీసుకునేవారు. ప్రభుత్వంతో పాటు భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీ వంటి ప్రైవేటు స్కీమ్ లు ఓ రేంజ్ లో విజయం సాధించాయి. ఇప్పటికే భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీ ఆన్ లైన్ లో నడుస్తోంది. గతంలో ప్రభుత్వం అధికారికంగా వీటిని రద్దు చేయడంతో బహిరంగ మార్కెట్లో లాటరీ టికెట్లు అమ్మే వారి ఉపాధికి దెబ్బ తగిలింది. ఇప్పుడు తాజా ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల్లో వీటిని భారీ ఎత్తున జనంలోకి తీసుకెళితే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే క్రమంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

English summary
andhra pradesh govt plans to bring back lottery scheme stopped earlier. in wake of latest financial situation govt is planning to acquire funds through this scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X