వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Govt Holidays:2021లో సెలవుల జాబితా ఇదే..ఆ రోజులు కలిసొస్తాయి..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాదికి సంబంధించి ప్రభుత్వ సెలవులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వచ్చే ఏడాది మొత్తం 15 సెలవులు ప్రభుత్వ సెలవులుగా గుర్తించాలని మరో రెండు సెలవులు ఆదివారం రోజున వచ్చినట్లు పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన సెలవులను తప్పకుండా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రత్యేకమైన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది వచ్చే ఏడాది గెజిట్‌లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ఇలా ఉంది.

* 14 జనవరి 2021 : మకర సంక్రాంతి -గురువారం

* 26 జనవరి 2021 : గణతంత్ర దినోత్సవం- మంగళవారం

* 11 మార్చి 2021: మహాశివరాత్రి - గురువారం

* 1 ఏప్రిల్ 2021: వార్షిక అకౌంట్స్ ముగింపు దినోత్సవం-గురువారం

* 2 ఏప్రిల్ 2021 : గుడ్ ఫ్రైడే- శుక్రవారం

* 13 ఏప్రిల్ 2021 : ఉగాది - మంగళవారం

AP govt releases list of 2021 holidays, Check out here

*14 ఏప్రిల్ 2021 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి: బుధవారం

* 1 మే 2021 : మే డే: శుక్రవారం

* 14 మే 2021 : రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) : శుక్రవారం

* 21 జూలై 2021 : బక్రీద్ (ఈద్-ఉల్-అజా) : బుధవారం

* 15 ఆగష్టు 2021 : స్వాతంత్ర్య దినోత్సవం: ఆదివారం

* 19 ఆగష్టు 2021 : మొహర్రం : గురువారం

* 30 ఆగష్టు 2021 : శ్రీ కృష్ణాష్ఠమి : సోమవారం

* 2 అక్టోబర్ 2021 : మహాత్మాగాంధీ జయంతి: శనివారం

* 15 అక్టోబర్ 2021 : విజయదశమి : శుక్రవారం

* 4 నవంబర్ 2021 : దీపావళి : గురువారం

* 25 డిసెంబర్ 2021 : క్రిస్మస్ : శనివారం

మొత్తానికి 22 జనరల్ హాలిడేస్ 18 ఆప్షనల్ హాలిడేస్‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక రంజాన్, బక్రీద్, మొహర్రంల పండుగల తేదీలు ఆరోజు చంద్రుడు ఆకాశంలో కనిపించేదాన్ని బట్టి మారే అవకాశాలున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ తేదీల్లో మార్పులు జరిగితే మీడియా సమావేశం ద్వారా సెలవు రోజును ప్రకటిస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

English summary
AP govt have released the list of Govt holidays for the year 2021. In this 22 General holidays and 18 optional holidays have been listed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X