వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు బకాయి తీర్చిన జగన్.. ఇకపై ఏపీలో సమూల మార్పులు.. రైతులకు గుడ్ న్యూస్..

|
Google Oneindia TeluguNews

''పంటల బీమా మొత్తాన్ని ముందుగా రైతులు చెల్లించిన తర్వాతే రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం భరించే విధానం ఉండేది. ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేస్తేనే రైతులకు సకాలంలో బీమా అందేది. ఈ విషయం తెలిసి కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు 2018-19 ఏడాదికిగానూ క్లెయిమ్స్ చెల్లించకుండా రైతులకు నష్టం చేకూర్చారు. ఇప్పుడా బకాయిలను నయాపైసతో సహా నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తున్నా.. '' అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ముందున్న ల్యాప్ టాప్ లో డబ్బులు ఆన్ లైన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేశారు.

మళ్లీ విచారణకు వైసీపీ నేత పీవీపీ డుమ్మా.. సీఎం జగన్ సరికొత్త ఎత్తుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ విచారణకు వైసీపీ నేత పీవీపీ డుమ్మా.. సీఎం జగన్ సరికొత్త ఎత్తుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు..

రైతులకు రూ.596 కోట్లు..

రైతులకు రూ.596 కోట్లు..

గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన పంటల బీమా పరిహారం(క్లెయిమ్) చెల్లింపులకై.. రూ. 596.36 కోట్లను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. తద్వారా 13 జిల్లాల్లోని సుమారు 6లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం.. వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల బీమాకు సంబంధించి ఏపీలో చేపట్టిన సమూల మార్పులను ఆయన వివరించారు.

చివరికి భూటాన్ కూడా భారత్‌కు షాకిచ్చింది.. నదీజలాల నిలిపివేత.. అస్సాం రైతుల ఆందోళన.. అన్నిదిక్కులా..చివరికి భూటాన్ కూడా భారత్‌కు షాకిచ్చింది.. నదీజలాల నిలిపివేత.. అస్సాం రైతుల ఆందోళన.. అన్నిదిక్కులా..

రూపాయి కడితే చాలు..

రూపాయి కడితే చాలు..

2019-2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ పంటల బీమా పథకాన్ని వర్తింప జేస్తామని, ఇకపై బీమాతో పాటు రైతులకు సంబంధించిన అన్ని సౌకర్యాలు రైతు భరోసా కేంద్రాల ద్వారానే కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రంలోనే ఇ- క్రాపింగ్‌ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని, అందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఇ- క్రాపింగ్‌ రిజిస్టర్‌ చేసి.. వెంటనే బీమా చెల్లించే విధానాన్ని రూపొందించామన్నారు. రైతులు కేవలం ఒక్క రూపాయి కడితే సరిపోతుందని, మిగతా ప్రీమియం మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.

58.76 లక్షల మంది రైతులకు లబ్ది..

58.76 లక్షల మంది రైతులకు లబ్ది..

పంటల బీమాను ఇ-క్రాప్‌తో‌ అనుసంధానించడం ద్వారా.. 2019 ఖరీఫ్‌ సీజన్ లో 25.73 లక్షల మంది రైతులకు.. అలాగే, 2019-20 రబీ సీజన్ లో మరో 33.03 లక్షల మందికి రైతులకు.. మొత్తం కలిపి 58.76లక్షల మంది రైతులకు ఉచితంగా పంటల బీమా సౌకర్యం అందజేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. 2019-2020 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్‌ పంటల బీమా వర్తింపజేస్తామన్న ఆయన.. పంటకు కనీస మద్దతు ధర కూడా కల్పిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు.

Recommended Video

Congress MLC Jeevan Reddy Exclusive Interview On Telangana Agriculture Policy || Oneindia Telugu
చంద్రబాబు పాపాన్ని కడిగేశారు..

చంద్రబాబు పాపాన్ని కడిగేశారు..


టీడీపీ గత ప్రభుత్వం బీమా చెల్లించని కారణంగానే రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాలేదన్న సీఎం జగన్.. పాత డబ్బులను అప్పులకు జమ చేసుకోకుండా.. ఆన్ ఇన్ కంబర్డ్ ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా సొమ్ము పొందడం ఇదే తొలిసారి అని కొందరు రైతులు చెప్పారు. బీమా బకాయిల విడుదలను ప్రస్తావిస్తూ.. రైతులకు చంద్రబాబు చేసిన నష్టాన్ని జగన్ పూడ్చారని, తద్వారా టీడీపీ చేసిన పాపాలను ఒక్కొక్కటిగా కడిగేస్తున్నారని వ్యాఖ్యానించారు.

English summary
andhra pradesh government released the pending insurance bills of Rs 596.36 crore, which were postponed by then cm chandrababu. on friday cm jagan interacted with formers of 13 districts via video conference
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X