వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాసనసభలో ప్రభుత్వ తీర్మానం: టీడీపీ నేతలపై చర్యల దిశగా..: చంద్రబాబు వివరణ ఇస్తూనే..!

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో సభ్యులు..ఉద్యోగులు..భద్రతా సిబ్బంది గౌరవాన్ని కాపాడే విధంగా..స్పీకర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సభలో తీర్మానం ప్రతిపాదించింది. అంతకు ముందు అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ..మార్షల్స్ మధ్య సాగిన ఘర్షణ పైన సభలో వాడీ వేడి చర్చ సాగింది. ఆ సందర్భంలో చంద్రబాబు..లోకేశ్ మార్షల్స్ పైన చేసిన వ్యాఖ్యల గురించి ప్రభుత్వం నిలదీసింది. దీని పైన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోతే తీర్మానం తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి స్పీకర్ సైతం చంద్రబాబు వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేసి గౌరవం నిలబెట్టుకోవాలని సూచించారు. అయితే, చంద్రబాబు జరిగిన విషయాన్ని వివరిస్తూ..సభలో తనకు జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని..ఆ తరువాత తాను చెబుతానని స్పష్టం చేసారు. దీంతో..మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు.

ఉన్మాది పాలనగా ఉండకూడదు..

ఉన్మాది పాలనగా ఉండకూడదు..

ప్రతీరోజు సీఎం మమ్మల్ని బూతులు తిడుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉండి తనను నడి రోడ్డు మీద ఉరి వేయాలని వ్యాఖ్యానించారు. చాలా రకాలుగా అవమానించారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ అడ్డుకున్నారని చేసారన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము అధికారంలో ఉండి ఈ రకంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు.

తమను కావాలని తమను అవమనాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇస్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల కోసం పోరాడుతామని..ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ముందుకు వెళ్తామని స్పష్టం చేసారు. ఉన్మాది పాలనగా ఉండకూడదు. పౌరుషంగా మాట్లాడనని..నేరాలు చేయలేదని చెప్పుకొచ్చారు. గట్టిగా మాట్లాడిన మాట వాస్తవమని అంగీకరించారు. అయితే బాధలో మాట్లాడనని వివరణ ఇచ్చారు. సభ లో జరిగిన తన అవమానికి ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

వారిపైన క్రిమినల్ చర్యలకు స్పీకర్ ఆదేశం

వారిపైన క్రిమినల్ చర్యలకు స్పీకర్ ఆదేశం

మీరు చేసిన వ్యాఖ్యలకు వీడియో ఉంది. సభ్యుల మనోభావాలు తెలుసుకున్న తరువాత..వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. భావోద్వేగంలో ఉన్నాని చెప్పుకొంటూ..క్షమాపణ చెప్పాలని సూచించారు. లేని పక్షంలో సభ తీసుకొనే నిర్ణయాన్ని గౌరవించాల్సి ఉంటుందని వివరించారు. జరిగిన దానికి పశ్చత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు. సీనియర్ నేతగా మీ గౌరవాన్ని పెంచుతుందని చెప్పుకొచ్చారు. మిమ్మల్ని మార్షల్స్ గౌరవిస్తారని..మిమ్మల్ని గుర్తిస్తారని..సభ్యులు కాని వారిని గుర్తించలేరని వివరించారు. ఈ ఘటనలో సభ్యులు కాని వారు ఉంటే..వారు బయటి వారైతే వారి మీద మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ను స్పీకర్ ఆదేశించారు. తనను ఎంబ్రాసింగ్ నుండి తప్పించాలని స్పీకర్ సూచించారు.

సభలో ప్రభుత్వం తీర్మానం

సభలో ప్రభుత్వం తీర్మానం

ఈ చర్చ సాగుతుండగానే ప్రభుత్వం సభలో తీర్మానం ప్రవేశ పెట్టింది. సభలో సభ్యులు..ఉద్యోగులు..భద్రతా సిబ్బంది గౌరవాన్ని పరిరక్షించే విధంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ తీర్మానం పైన స్పీకర్ సభలోని సభ్యుల అభిప్రాయాలు కోరారు. జరిగిన విషయాన్ని పక్కన బెట్టి..చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. దీని పైన స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

English summary
AP govt resolution on action against TDP leaders in serious comments against marshals. YCP demanded action against Marshals in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X