వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు..మోదీ గొప్పల‌కు తిప్ప‌లు: కియో ఘ‌న‌త ఆ ఇద్ద‌రిది కాదు : అసెంబ్లీ సాక్షిగా ...ఆధారాల‌తో స‌హా..!

|
Google Oneindia TeluguNews

అయిదేళ్ల కాలంలో కియో మోటార్స్ త‌మ ఘ‌న‌త‌గా మాజీ మఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తీ సంద‌ర్భ‌లో చెప్పేవారు. ఇది త‌మ ఘ‌న‌త అంటూ..క‌రువు సీమ‌లో కియో సంస్థ తెచ్చిన ఘ‌న‌త త‌మ‌దే అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల ముందు హ‌డావుడిగా తొలి ఉత్ప‌త్తి అంటూ కారు సైతం విడుద‌ల చేసారు. అది కూడా అప్ప‌ట్లో వివాదాస్ప‌దం అయింది. కానీ, శాస‌న‌స‌భా సాక్షిగా కియో మోటార్స్ ఏపిలో పెట్టుబ‌డి పెట్ట‌టానికి.. సంస్థ ఏర్పాటుకు ముందుకు రావ‌టం వెనుక అస‌లు చంద్ర‌బాబు..మోదీ కార‌ణం కాదంటూ అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టారు. ఇందుకు ఆధారాల‌ను చూపించారు. దీంతో .. కియో త‌మ గొప్ప అంటూ టీడీపీ..బీజేపీ నేత‌లు చెప్పుకున్న గొప్ప‌ల‌కు తిప్ప‌లు మొద‌ల‌య్యాయి.

కియో మోటార్స్ పైన మోదీ..బాబు క్రెడిట్ గేమ్..

కియో మోటార్స్ పైన మోదీ..బాబు క్రెడిట్ గేమ్..

అనంత‌పురంలో హ్యుండాయ్ సంస్థలో విభాగ‌మైన కియో సంస్థ త‌మ కార్ల త‌యారీ ప్లాంట్‌ను అనంత‌పురం లో ఏర్పా టు చేయ‌టం వెనుక తాను ప‌డిన క‌ష్టం..కొరియా వెళ్లి వారి మీద ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాల నుండి ఒత్తిడి ఉన్నా ఒప్పించి ఏపీకి తీసుకొచ్చాన‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌లుమార్లు చెప్పుకున్నారు. త‌మ ప్ర‌భుత్వంలో పెట్టుబ‌డుల గురించి చ‌ర్చ వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఇదే అంశాన్ని ప్ర‌స్తావించేవారు. అయితే, బీజేపీతో సంబంధాలు బెడిసి కొట్టిన త‌రువాత బీజేపీ నేత‌లు క్రెడిట్ గేమ్ మొద‌లు పెట్టారు. ఏపీకి కియో సంస్థ రావటానికి చంద్ర‌బాబు కార‌ణం కాద ని..ప్ర‌ధాని మోదీ జోక్యంతోనే ఏపీకి కియో మోటార్స్ వ‌చ్చింద‌ని బీజేపీ నేత‌లు వాదించారు. దీంతో..టీడీపీ..బీజేపీ శ్రేణు లు చంద్ర‌బాబు గొప్ప‌త‌నం వారి వారు..కాదు మోదీ జోక్యంతోనే సాద్య‌మైంద‌ని బీజేపీ నేత‌లు వాదించుకున్నారు. ఇక‌, ఇప్పుడు అస‌లు కియో సంస్థ ఏపికి రావ‌టానికి కార‌ణం ఆ ఇద్ద‌రూ కాద‌నే సంచ‌ల‌న విష‌యాన్ని వైసీపీ ప్ర‌భుత్వం స‌భ లో బ‌య‌ట పెట్టింది.

Recommended Video

ముగిసిన టీడీఎల్పీ సమావేశం
కియో సంస్థ నాటి హామీ మేర‌కే..

కియో సంస్థ నాటి హామీ మేర‌కే..

కియో సంస్థ గురించి శాస‌న‌స‌భ‌లో మ‌రోసారి మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్ర‌స్తావించారు. తాను సంస్థ ప్ర‌తినిదుల ను ఒప్పించి ఏపీకి కియో మోటార్స్ వ‌చ్చేలా చేసాన‌ని చెప్పుకొచ్చారు. దీంతో.. మంత్రి బుగ్గ‌న ఒక లేఖ బ‌య‌ట పెట్టారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కియో మోటార్స్ ఛైర్మ‌న్‌..సీఈవో ఉన్న వ్య‌క్తి రాసిన లేఖ‌ను బుగ్గ‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. అందులో కియో సీఈవో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్సార్ తో త‌మ‌కు ఉన్న అనుభ‌వా ల‌ను బ‌య‌ట పెట్టారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2007 లో భేటీ జ‌రిగింద‌ని గుర్తు చేసారు. ఆ సంద ర్భంలో హ్యుండాయ్ సంస్థ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయ‌టంతో పాటుగా ..అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనికి ప్ర‌తిస్పంద‌న‌గా కియో సీఈవో తాము భార‌త్‌లో భ‌విష్య‌త్‌లో పెట్టుబ‌డి పెడితే ఖ‌చ్చితంగా ఏపీలోనే పెడుతామ‌ని తాను హామీ ఇచ్చాన‌ని కియో సీఈవో లేఖ‌లో పేర్కొన్నారు. వైయ‌స్సార్‌కు ఇచ్చిన హామీ మేర‌కు కియో మొద‌టి ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేసామంటూ సంస్థ సీఈవో రాసిన లేఖ‌ను ఆర్దిక మంత్రి బుగ్గ‌న స‌భ‌లో చ‌దివి వివ‌రించారు.

చంద్రబాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పైన‌..

చంద్రబాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పైన‌..

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల కోసం 39 కోట్లు ఖ‌ర్చ చేసార‌ని..దీని వ‌ల‌న ఏపికి ఎటువంటి ప్ర‌యోజ‌నం క‌లిగింద‌ని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఉప‌యోగం లేని ప‌ర్య‌ట‌న‌ల ద్వారా ప్ర‌భుత్వ సొమ్మును వెచ్చింది వ్య‌క్తిగ‌త ప‌నుల‌ను పూర్తి చేసుకున్నార‌ని ఆరోపించారు. దీని మీద మొత్తంగా కేంద్ర ప్ర‌భుత్వంతో విచార‌ణ చేయించి..ఆ మొత్తాన్ని రాబ‌ట్టాల‌ని డిమాండ్ చేసారు. చంద్ర‌బాబు స్పందిస్తూ తాను చేసిన ప్ర‌తీ విదేశీ ప‌ర్య‌ట‌న ఏపీ కోస‌మేన‌ని..ప్రతీ క్ష‌ణం రాష్ట్ర అభివృద్ది కోస‌మే ప‌ని చేసాన‌ని చెప్పుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్‌లో ఏపీని రెండో స్థానంలో నిలిపామ‌ని వివ‌రించారు. దీనికి ఆర్దిక మంత్రి బుగ్గ‌న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆచ‌ర‌ణ‌లో వ‌చ్చిన ర్యాంకు కాద‌ని..అది ఒక ప్ర‌శ్నాప‌త్రానికి వ‌చ్చిన స‌మాధానాల ఆధారం గా వ‌చ్చే ర్యాంకు అని చెప్పి అది చంద్ర‌బాబు గొప్ప కాద‌ని తేల్చి చెప్పారు.

English summary
AP Govt revealed KIO CEO letter to Cm Jagan on previous relations with late YSR. In That letter CEO mentioned by request of YSR they invest for KIO plant in AP. Minister Buggan stated that KIO is not credit of Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X