అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెయిర్ సెలూన్‌ కు వెళ్తున్నారా ? సొంత టవల్స్ , ప్రీబుకింగ్స్, ధర్మల్ స్కానింగ్- ఏపీలో షాకింగ్ రూల్స్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున కేవలం కంటైన్ మెంట్ జోన్ల బయట హెయిర్ కటింగ్ షాపులు, సెలూన్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వీటి నిర్వహణ విషయంలో కఠిన నిబంధనలు విధించింది. ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని ఈ రూల్స్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. అయితే కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతాలు కాబట్టి వీటిని కచ్చితంగా పాటించాల్సిందేనని పురపాలకశాఖ స్పష్టం చేసింది.

 హెయిర్ సెలూన్స్ కొత్త రూల్స్...

హెయిర్ సెలూన్స్ కొత్త రూల్స్...

ఏపీలో కరోనా వ్యాప్తి కారణంగా జనం సెలూన్లకు వెళ్లకుండా దాదాపు రెండు నెలలుగా ఇళ్లలోనే గడుపుతున్నారు. ఇప్పుడు వీరందరూ సెలూన్లకు వెళ్లాలంటే ప్రభుత్వం విధించిన కొ్త్త నిబంధనలు పాటించాల్సిందే. కానీ వాటిని చూస్తే సెలూన్ కు వెళ్లాలా వద్దా అనే మీమాంసలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హెయిర్ సెలూన్‌ కు వెళ్లే ప్రతీ కస్టమర్ ఇకపై తన సొంత టవల్ తీసుకెళ్లాల్సిందే. సెలూన్లలో ఉన్నంతసేపూ అక్కడ భౌతిక దూరంతో పాటు ఇతర నిబంధనలన్నీ పాటించాల్సిందే.

 చిన్న షాపుల్లో నిబంధనలు..

చిన్న షాపుల్లో నిబంధనలు..

ఏపీలో ఇకపై చిన్నచిన్న హెయిర్ కటింగ్ షాపులకు వెళ్తినప్పుడు అక్కడ నిర్వాహకులు చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. అలాగే నిర్వాహకులు కూడా మాస్కులు, చేతి గ్లౌజులు ధరించాల్సిందే. కస్టమర్ కటింగ్ పూర్తి చేయించుకుని తర్వాత అతను కూర్చున్న కుర్చీని శానిటైజ్ చేయాల్సిందే. ఒకసారి వాడిన రేజర్లు, బ్లేడ్‌ లు మరోసారి వాడకూడదు. ఈ నిబంధనలకు పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణమైతే కఠిన చర్యలు తప్పవు.

Recommended Video

Lockdown 4.0 : APSRTC Announced New Guidelines For Passengers
 పెద్ద సెలూన్లకు రూల్స్ ఇవే..

పెద్ద సెలూన్లకు రూల్స్ ఇవే..

పెద్ద సెలూన్స్ కు వెళ్లే కస్టమర్లతో పాటు నిర్వాహకులకు కూడా ఇకపై కష్టాలు తప్పకపోవచ్చు. పెద్ద సెలూన్లకు వెళ్లే వారికి థర్మల్ స్కానింగ్ తప్పనిసరి. అలాగే సెలూన్ కు వచ్చే కస్టమర్ల పేరు, ఫోన్ నంబర్ తీసుకుంటారు. కస్టమర్లు ముందుగా ఫోన్ చేసి రావాల్సిందే. గుంపులు, గుంపులుగా వచ్చి నిరీక్షిస్తే కస్టమర్లతో పాటు యజమానులపైనా చర్యలు తప్పవు. కస్టమర్ కు మాస్క్ తప్పనిసరి, అలాగే సెలూన్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి. సెలూన్ తెరిచి, మూసే సమయాలతో పాటు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూనే ఉండాలి.

English summary
in wake of coronavirus spread, andhra pradesh government has announced new rules for hair saloons in the state. as per the new ruels every customer has to bring his own towel to hair saloons complulsory. big saloons to maintain ppe kits also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X