వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్ టెండరింగ్ ఫలించింది: పోలవరం ప్రాజెక్టు పనుల్లో రూ. 50 కోట్లు ఆదా..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ మంచి ఫలిలాలను ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పోలవరం ప్రాజె‌క్ట్‌లోని 65 ప్యాకేజీల పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకే కోట్ అయ్యింది. దీంతో మొత్తం పని విలువలో రూ. 58 కోట్ల తక్కువకు హైదరాబాద్‌కు చెందిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఎల్-1గా బిడ్ దాఖలు చేసింది.

తక్కువకు బిడ్డింగ్ చేసిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ

తక్కువకు బిడ్డింగ్ చేసిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ

గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని రూ.276 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని రద్దు చేసిన జగన్ సర్కార్ అదే పనికి రివర్స్ టెండరింగ్ ద్వారా మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ 231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా కేవలం రూ.300 కోట్లు విలువ చేసే పనిలోనే ఇంత ఆదా అయ్యిందంటే భవిష్యత్తులో ఖరారు కానున్న హైడల్, హెడ్ వర్క్స్‌కి సంబంధించిన పనుల్లో చాలా డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంది.

 రివర్స్ టెండరింగ్ పద్ధతి ఇలా ఉంటుంది

రివర్స్ టెండరింగ్ పద్ధతి ఇలా ఉంటుంది

సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే రివర్స్ టెండరింగ్లో పద్ధతి ఇందుకు భిన్నంగా ఉంది. ఎల్-1గా వచ్చిన సంస్థ ధరను బేసిక్ బెంచ్ మార్క్‌గా ప్రకటించి దాని ఆధారం చేసుకుని మరింత తక్కువకు బిడ్డింగ్‌లో పాల్గొనే ఆయా కంపెనీలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు హైదరాబాదుకు చెందిన మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేసింది. మిగిలిన సంస్థలకన్నా ఇది బాగా తక్కువ కావడంతో ఈ కంపెనీకే పనులు దక్కాయి.

మూడు గంటల పాటు ఆరు కంపెనీల పోటీ

మూడు గంటల పాటు ఆరు కంపెనీల పోటీ


శుక్రవారం ఉదయం 11 గంట నుంచి రివర్స్ టెండరింగ్ ఈ- ఆక్షన్ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో ఆరు కంపెనీలు పోటీపడ్డాయి. అవి ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, హైదరాబాదుకు చెందిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాదుకే చెందిన మరో సంస్థ మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ , ముంబైకి చెందిన ఆఫ్‌కాన్స్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాదుకు చెందిన ఎంఆర్‌కేఆర్ ఎస్‌ఎల్‌ఆర్ జేవీ, మరో హైదరాబాద్ సంస్థ ఆర్ఆర్‌సీఐఐపీఎల్-డబ్ల్యూసీపీఎల్ కన్సోర్టియం సంస్థలు ఉన్నాయి.

 పారదర్శకంగా జరిగిన రివర్స్ టెండరింగ్

పారదర్శకంగా జరిగిన రివర్స్ టెండరింగ్


దాదాపు మూడు గంటల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన సంస్థ అర్హతలను పరిశీలించి పనులు అప్పగించే అవకాశం ఉంది. మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ అత్యంత తక్కువకే బిడ్ దాఖలు చేయడంతో ఆసంస్థకే పనులు అప్పగించనుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారు కావడంతో దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అయ్యాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. మొత్తం మీద రూ.58.53 కోట్లు ఆదా అయినట్లు ఆయన చెప్పారు.

English summary
Major success for AP government had come in the experimented Reverse tendering on Polavaram project. Hyderabad based Max infra ltd, had quoted the bid for Rs.231 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X